ఒకేసారి ఎన్నికలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణకు రాజ్యాంగ సవరణతో పాటు అదనపు వనరులు అవసరమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ సంఘానికి వెల్లడించామని చెప్పారు.
పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన మొదటిసారి ఓటర్లు, 15–17 ఏళ్ల వయసు వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే సదస్సు ఉద్దేశమని చెప్పారు.