‘ముందస్తు’కు రెడీ.. | Arrangements Regarding Telangana Elections In Nalgonda | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’కు రెడీ..

Published Sat, Nov 10 2018 12:11 PM | Last Updated on Sat, Nov 10 2018 12:16 PM

Arrangements Regarding Telangana Elections In Nalgonda  - Sakshi

సాక్షి,నల్లగొండ : ముందస్తు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఎన్ని కల అధికారులు తాజా గా పోలింగ్‌కు సంబంధించి ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా అధికా రులు, సిబ్బంది ఎంపిక పూర్తి చేసింది. 15రోజుల నుంచి వివిధ రకాలుగా కసరత్తు నిర్వహించిన అధి కారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాబితాను సిద్ధం చేశారు.2018 డిసెంబర్‌ 7న జరుగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఉప ఎన్నికల అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. 


అసెంబ్లీ రద్దు మొదలు..
అసెంబ్లీ రద్దు మొదలు.. ఎన్నికల షెడ్యూల్డు విడుదలైనప్పటి నుంచి ఓటరు నమోదు, ఓటు మార్పు, పేరులో తప్పుల సవరణలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి కొత్త ఓటర్లు నమోదుకు శ్రీకారం చుట్టి సక్సెస్‌ అయ్యారు. దాదాపు 50 వేల ఓట్ల వరకు కొత్తగా పెరిగాయి. కాగా, తుది జాబితాను గత నెల 12 విడుదల చేశారు. అంతకు ముందే ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఆరుగురిని నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించారు. వీరు ఎన్నికల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితా మోదలుకొని నామినేటషన్లు, ఉపసంహరణ, పరిశీలన, పోలింగ్‌ , ఓట్ల లెక్కింపు, ఆ తదుపరి గెలిచిన వ్యక్తులకు నియామక పత్రలను అందించే వరకు వీరు బాధ్యతలు నిర్వర్తించనున్నారు


ఎన్నికల అధికారులకు సాయంగా.. 
అదేవిధంగా వీరికి సహాయంగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఇందుకు అంతా తహ సీల్దార్లను తీసుకున్నారు. దాదాపు 24మంది వరకు ఎన్నికల్లో అవలంబించాల్సిన విధులు, ఎన్నికల నియమావళి, ఈవీఎంల ఇన్‌చార్జి, తదితర వాటికి సంబంధించి నోడల్‌ అధికారులను నియమించారు. వారు వారి విధులను ప్రారంభించారు. కాగా,  12 పోలింగ్‌ స్టేషన్లకు ఒక సెక్టార్‌ ఆఫీసర్‌ నియమించారు. అంటే దాదాపు ఒక నియోజకవర్గలో 25 మందివరకు ఉంటారు . వీరు ఎన్నికల సంబంధించి విధులు నిర్వహిస్తున్నారు. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ అధికారులు .
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌కు సంబంధించి అధికారులు, సిబ్బంది ఎంపిక పూర్తి చేశారు. కలెక్టర్‌ అనుమతే తరువాయి. సిబ్బందికి ఈ నెల 13నుంచి పోలింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధి కారులు, ఇతర అధికారులను నియమించారు. 


నియామకం ఇలా.. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ఒక్కో ప్రిసైడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారిని నియమించారు. అదే విధంగా ఇద్దరి చొప్పున అదర్‌ పోలింగ్‌ అధికారును నియమించారు. అయితే పోలింగ్‌ అధికారులను, సిబ్బంది అవసరం ఉన్న దానికంటే 20శాతం అదనంగా తీసుకున్నారు. వారిని రిజర్వులో ఉంచనున్నారు. 


సిబ్బంది బాధ్యతలు ఇలా.. 
ప్రిసైడింగ్‌ అధికారులకోసం : గెజిటెడ్‌ అధికారులను, సూపరింటెండ్లను, స్కూల్‌ అసిస్టెంట్లను తీసుకున్నారు. 
అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికోసం : ఎస్‌జీటీ, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ను తీసుకున్నారు. 
అదర్‌ పీఓల కోసం : ఎస్‌జీటీ, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌లలో జూనియర్లను తీసుకున్నారు.


విధుల నిర్వహణ ఇలా.. 
సొంత నియోజకవర్గం, పనిచేసే నియోజకవర్గం, నివాసముండే నియోజకవర్గంలో విధులకు అవకాశం ఉండదు. వీరు ఇతర నియోజక వర్గాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా నిర్వహిస్తారు. అయితే ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు వారి ఆర్డర్‌ ఆధారంగా మొదట శిక్షణ పొందు తారు. ఆతరువాత రెండోసారి శిక్షణ సమయంలో ఏ నియోజకవర్గంలో విధులు అనేది తెలుస్తుంది. మొదట అధికారులకు శిక్షణ తరువాత పీఓలకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే వివిధ కేటగిరీల అధికారులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్‌ ట్రైనర్లకు సైతం పకడ్బందీగా తర్ఫీదు ఇచ్చారు.

జిల్లాల వారిగా అధికారులు, సిబ్బంది 

నల్లగొండ జిలాల్లో...

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు​​

1629
ప్రిసైడింగ్‌ అధికారులు   1655
అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు  1655
అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు 3910

సూర్యాపేట జిల్లాలో...  

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు    1,091
ప్రిసైడింగ్‌ అధికారులు    1,309
అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు   1,309
అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు   2,619 

యాదాద్రి భువనగిరి జిల్లా..  

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు  552
ప్రిసైడింగ్‌ అధికారులు    663
అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు  663
అదర్‌ పోలింగ్‌ అధికారులు  1,325 


  
​​​​​​​



 
 

  
 
  
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement