vote count
-
ఢిల్లీ ఓట్ల లెక్కింపు నేడే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్‌బూత్‌లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది. -
గంటకు 3రౌండ్లు ఓట్ల లెక్కింపు
కడప సెవెన్‌రోడ్స్ :జిల్లాలో ఈనెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి సి.హరి కిరణ్ కోరారు. మంగళవారం తన చాంబర్లో అభ్యర్థులు, పార్టీల ప్రతిని«ధులతో ఆయన సమావేశమయ్యారు. 23వ తేది ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పూర్తయ్యే వరకు బ్రేక్ ఉండదని చెప్పారు. గంటకు మూడు రౌండ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలో మాదిరి ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. కడప పార్లమెంటు సెగ్మెంట్లో 1940 మంది సర్వీసు ఓటర్లకు ఈటీపీబీఎస్ పద్దతిలో పోస్టల్ బ్యాలెట్లు పంపించామని పేర్కొన్నారు. అందులో ఇప్పటివరకు 870 వచ్చాయన్నారు. సమయం ఉన్నందున80 శాతం వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చే అవకా శం ఉందన్నారు. ఒక్కో ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు నాలుగు నిమిషాలు పడుతుందని చెప్పారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ చేపడతామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంలలో కౌంటింగ్ పూర్తి చేయకూడదని స్పష్టం చేశా రు. కడప లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెం ట్లలో రిటర్నింగ్ అధికారి టేబుల్‌తో సహా బద్వేలు 11, కడపలో 15, పులివెందుల 11, జమ్మలమడుగు 15, మైదుకూరు 11, కమలాపురం 15, ప్రొద్దుటూరు 15 చొప్పున మొత్తం 93 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోస్టల్ బ్యా లెట్ల కౌంటింగ్‌కు సంబంధించి ఒక్కొక్కో రూములో తొమ్మిది టేబుళ్లు చొప్పున రెండు రూముల్లో 18 టేబుల్స్ ఉంటాయన్నారు. ఈటీపీబీఎస్ లెక్కింపునకు ఒక హాలులో ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. దీని ప్రకారం 112 మంది కౌంటింగ్ ఏజెంట్ల పేర్లను, ఫోటోలను ఈనెల 16లోగా సమర్పించాలని సూచిం చారు. క్రిమినల్ కేసులుఉన్న వారిని ఏజెంట్లుగా నియమించరాదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన వారిని కూడా ఏజెంట్లుగా ప్రతిపాదించరాదన్నారు. ఏజెంట్లకు ఈనెల 20న ఐడీ కార్డులు జారీ చేస్తామన్నారు. డిక్లరేషన్ ఫారం సమర్పించి ఐడీ కార్డులు తీసుకోవాలని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీఎస్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుందన్నా రు. ఇవన్నీ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎం పిక చేసిన వీవీ ప్యాట్ స్లిప్పులను కౌంటింగ్ చేస్తామన్నారు. డీఆర్వో రఘునాథ్, కడప పార్లమెంటు అభ్యర్థులు పాల్గొన్నారు. -
సిరాను చెరిపేసి.. రెండోసారి ఓటేసి!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు అక్కడ పనిచేయలేదు.. ఒక ఓటరు ఒక రోజు ఒకే రాష్ట్రానికి ఓటేయ్యాలని నిబంధన ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లలో కొందరు రెండు రాష్ట్రాలకు ఓటేసినట్లు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర పోలింగ్ బూత్ కేంద్రాలోనూ ఓటు హక్కును విని యోగించుకున్నారు. తమ ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న సిరా చుక్కను చెరిపేసి రెండో ఓటు కూడా వేశారు. ఈ సంఘటనలు పరందోళి, ముకదంగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో జరిగి నట్లు సమాచారం. నిమ్మకాయతో చెరిపేసి.. ఓటర్లు వివిధ క్రియలతో రెండు ఓట్లను ఉపయోగించుకున్నారు. కొందరు తలకు నూనే రాసుకుని వచ్చారు. ఎన్నికల కేంద్రంలో అధికారులు వేలికి సిరాను అంటించంగా బయటికి వచ్చేసి ఆ వేలిని తలకు రాయడంతో సిరా కనిపించకుండా పోతుం ది. అలాగే కొందరు వేలికి అంటిన సిరాను నిమ్మకాయ రసంతో చెరిపేస్తున్నారు. ఇంకొందరు నిమ్మకాయ రసంలో నాన్చిన పుల్లతో సిరాను చేరి పేసి రెండో సారి ఓటు వేశారు. మిగిలిన కుటుం బాల్లో సగం తెలంగాణ, మరోసగం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. కెరమెరి మండలంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగిందని సమాచారం. ప్రయాణానికి ఇబ్బంది పడిన ఓటర్లు మండలంలో భోలాపటార్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రానికి రావాడానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక లేక కొందరు కాలినడకతో రాగా.. మరి కొందరు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకుని రావడం కనిపించింది. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరందోలి పోలింగ్ కేంద్రంలో (పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, శంకర్‌లొద్ది) ముకదంగూడలో (మహరాజ్‌గూడ, ముకదంగూడ) భోలాపటార్‌లో (భోలాపటార్, గౌరి, లేండిగూడ)అంతాపూర్లో (అంతాపూర్, ఏసాపూర్, నారాయణగూడ, ఇంద్రానగర్, పద్మావతి) గ్రామాలున్నాయి. మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల్లోనూ మన గ్రామాలున్నాయి. పరందోలి పోలింగ్ బూత్‌లో (ముకదంగూడ, లేండిజాల, కోటా, పరందోలి) వణిలో ( శంకర్‌లొద్ది), మహరాజ్గూడలో (మహారాజ్‌గూడ), భోలాపటార్‌లో (పలస్‌గూడ, ఏసాపూర్, లేండిగూడ, నారాయణగూడ, భోలాపటర్) పుడ్యాన్మొహదాలో (పద్మావతి, అంతాపూర్) గ్రామాలున్నాయి. -
‘ఓటు’ దూరం..!
ఏలూరు రూరల్: ఎన్నికల అధికారులు టీడీపీ నేతల గుప్పెట్లో బందీలయ్యారు. వారు చెప్పింది, చెప్పినట్టుగా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, ఎస్సీ వర్గానికి చెందిన వారి ఓట్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరపు పోలింగ్‌బూత్‌ల పరిధిలో చేర్చుతున్నారు. ఫలితంగా పోలింగ్ బూత్ దూరమైతే అంతదూరం వెళ్లి ఓటు వేయరనే కుయుక్తితోనే ఇలా చేస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ బూరాయిగూడెంకు చెందిన కాకి రత్నప్రత్యూష ఇటీవల ఓటు కోసం ఆన్లైన్లో దరకాస్తు చేసుకున్నారు. ఈమెకు వెంకటాపురం పంచాయతీ సుంకరవారిగూడెం చిరునామాతో ఓటు మంజూరైంది. ఆన్లైన్లో పరిశీలించుకున్న ప్రత్యూష మరోసారి చిరునామా మార్పునకు దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా తంగెళ్లమూడి పంచాయతీ బీడీకాలనీని చిరునామాగా పేర్కొంటూ అధికారులు ఓటు మంజూరు చేశారు. దీనిపై అనుమానం వచ్చి పలువురు బూరాయిగూడెం వాసులు ఓటర్ల జాబితా పరిశీలించగా, చాలా చిరునామాలు తారుమారైనట్టు గుర్తించారు. మరిన్ని ఆధారాలు ఇవిగో.. గత 30 ఏళ్ళుగా బూరాయిగూడెంలో నివాసం ఉంటూ ఓటు వేస్తున్న కొట్టె అవ్వమ్మ ఓటు ఈ సారి ఏలూరు నగరం సెయింట్ గ్జెవియర్ స్కూల్ బూత్‌కు బదిలీ అయ్యింది. - వాసే వెంకటేశ్వరరావు ఓటు సైతం తారుమారైంది. - నాలుగు నెలల క్రితం దాకారపు మాణెమ్మ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. వీటిపై వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులు, స్థానిక యువకులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ నేతల ఇళ్ల వద్దే పరిశీలన వాస్తవానికి ప్రజలు ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారి ద్వారా ఏరియా సూపర్వైజర్కు అది చేరుతుంది. సూపర్వైజర్తో పాటు బూత్‌లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడు చిరునామా నిర్ధారించుకుని ఓటు మంజూరుకు ఉన్నతధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ క్షేత్రస్దాయి పరిశీలనకు వెళుతున్న సూపర్వైజర్లు, బీఎల్ఓలు స్థానిక టీడీపీ నాయకుల ఇళ్లకు చేరుకుంటున్నారు. వారికి దరఖాస్తుదారుడు వివరాలు చెబుతున్నారు. దీన్ని గ్రహించిన టీడీపీ నేతలు దరఖాస్తుదారుడు తమ పార్టీకి వ్యతిరేకమా, అనూకూలమా గుర్తించి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీన్ని తీసుకుంటున్న ఎన్నికల అ«ధికారులు అదే సమాచారం ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ఇలా టీడీపీ నాయకులు తమకు వ్యతిరేకమైన ఓటర్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరాన ఉన్న బూత్‌లకు బదిలి అయ్యేలా కుట్రలు చేస్తున్నారు. ఫలితంగా ఓటరు విసిగి చెంది ఓటు వేయకుండా ఉంటాడని భావిస్తున్నారు. మరోపక్క మండలంలో కొందరు ఎన్నికల అధికారులు ఫారం–6లను తీసుకుని పంచాయతీ, వీఆర్వో కార్యాలయాల వద్ద కూర్చుని దరఖాస్తుదారుడుకు ఫోన్ చేసి నిర్ధారించుకుంటున్నారు. దరఖాస్తుదారుడు ఫోన్‌కు స్పందించకపోతే అధికారులు తమ ఇస్టానుసారం మార్చేస్తున్నారు. ఫలితంగా మండలంలో వెంకటాపురం, తంగెళ్లమూడి, శనివారపుపేట తదితర గ్రామాల్లో ఓటర్ల చిరునామాలు పెద్ద సంఖ్యలో తారుమారయ్యాయి. మూడుసార్లు చిరునామా మార్చుకున్నా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ «అధికారీ మా ఇంటికి వచ్చి పరిశీలన చేయలేదు. నా వివరాలు సేకరించలేదు. మరి నాకు ఓటు ఎలా మంజూరు చేశారో తెలియడం లేదు. ఓటర్ ఐడీలో చిరునామా మార్పు కోసం ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాను. మొదటసారి సుంకరవారిగూడెం అడ్రస్‌తో ఓటు వచ్చింది. తర్వాత బీడీకాలనీలో వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో నా ఓటు పరిశీలిస్తే రెండు చిరునామాల్లో ఓటు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను ఓటు ఎక్కడ వేయాలి. – కాకి రత్నప్రత్యూష, బూరాయిగూడెం నేను ఉంటున్న చోటే ఓటు కావాలి కొన్నేళ్ళుగా నేను, నా భర్త బూరాయిగూడెంలో ఉంటున్నాం. ఎంతోకాలంగా సాయినగర్ బూత్ నెంబర్ 184లో ఓటు వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మా ఓట్లు ఏలూరు సెయింట్ గ్జేవియర్లో బూత్‌నెంబర్ 48లో ఉన్నట్లు చూపుతున్నారు. ఓటు కోసం అంతదూరం ఎలా వెళ్లగలం. ఉన్న చోటే మాకు ఓటు కావాలి. దరఖాస్తు చేసుకోవడం మాకు తెలియదు. ఏం చేయాలి. – వాసా ఏడుకొండలు, స్థానికురాలు -
‘ముందస్తు’కు రెడీ..
సాక్షి,నల్లగొండ : ముందస్తు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఎన్ని కల అధికారులు తాజా గా పోలింగ్‌కు సంబంధించి ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా అధికా రులు, సిబ్బంది ఎంపిక పూర్తి చేసింది. 15రోజుల నుంచి వివిధ రకాలుగా కసరత్తు నిర్వహించిన అధి కారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాబితాను సిద్ధం చేశారు.2018 డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఉప ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. అసెంబ్లీ రద్దు మొదలు.. అసెంబ్లీ రద్దు మొదలు.. ఎన్నికల షెడ్యూల్డు విడుదలైనప్పటి నుంచి ఓటరు నమోదు, ఓటు మార్పు, పేరులో తప్పుల సవరణలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి కొత్త ఓటర్లు నమోదుకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యారు. దాదాపు 50 వేల ఓట్ల వరకు కొత్తగా పెరిగాయి. కాగా, తుది జాబితాను గత నెల 12 విడుదల చేశారు. అంతకు ముందే ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఆరుగురిని నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించారు. వీరు ఎన్నికల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితా మోదలుకొని నామినేటషన్లు, ఉపసంహరణ, పరిశీలన, పోలింగ్ , ఓట్ల లెక్కింపు, ఆ తదుపరి గెలిచిన వ్యక్తులకు నియామక పత్రలను అందించే వరకు వీరు బాధ్యతలు నిర్వర్తించనున్నారు . ఎన్నికల అధికారులకు సాయంగా.. అదేవిధంగా వీరికి సహాయంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఇందుకు అంతా తహ సీల్దార్లను తీసుకున్నారు. దాదాపు 24మంది వరకు ఎన్నికల్లో అవలంబించాల్సిన విధులు, ఎన్నికల నియమావళి, ఈవీఎంల ఇన్చార్జి, తదితర వాటికి సంబంధించి నోడల్ అధికారులను నియమించారు. వారు వారి విధులను ప్రారంభించారు. కాగా, 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టార్ ఆఫీసర్ నియమించారు. అంటే దాదాపు ఒక నియోజకవర్గలో 25 మందివరకు ఉంటారు . వీరు ఎన్నికల సంబంధించి విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అధికారులు .. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌కు సంబంధించి అధికారులు, సిబ్బంది ఎంపిక పూర్తి చేశారు. కలెక్టర్ అనుమతే తరువాయి. సిబ్బందికి ఈ నెల 13నుంచి పోలింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధి కారులు, ఇతర అధికారులను నియమించారు. నియామకం ఇలా.. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఒక్కో ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిని నియమించారు. అదే విధంగా ఇద్దరి చొప్పున అదర్ పోలింగ్ అధికారును నియమించారు. అయితే పోలింగ్ అధికారులను, సిబ్బంది అవసరం ఉన్న దానికంటే 20శాతం అదనంగా తీసుకున్నారు. వారిని రిజర్వులో ఉంచనున్నారు. సిబ్బంది బాధ్యతలు ఇలా.. ప్రిసైడింగ్ అధికారులకోసం : గెజిటెడ్ అధికారులను, సూపరింటెండ్లను, స్కూల్ అసిస్టెంట్లను తీసుకున్నారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారికోసం : ఎస్జీటీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌ను తీసుకున్నారు. అదర్ పీఓల కోసం : ఎస్జీటీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లలో జూనియర్లను తీసుకున్నారు. విధుల నిర్వహణ ఇలా.. సొంత నియోజకవర్గం, పనిచేసే నియోజకవర్గం, నివాసముండే నియోజకవర్గంలో విధులకు అవకాశం ఉండదు. వీరు ఇతర నియోజక వర్గాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా నిర్వహిస్తారు. అయితే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు వారి ఆర్డర్ ఆధారంగా మొదట శిక్షణ పొందు తారు. ఆతరువాత రెండోసారి శిక్షణ సమయంలో ఏ నియోజకవర్గంలో విధులు అనేది తెలుస్తుంది. మొదట అధికారులకు శిక్షణ తరువాత పీఓలకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే వివిధ కేటగిరీల అధికారులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్లకు సైతం పకడ్బందీగా తర్ఫీదు ఇచ్చారు. జిల్లాల వారిగా అధికారులు, సిబ్బంది నల్లగొండ జిలాల్లో... మొత్తం పోలింగ్ స్టేషన్లు 1629 ప్రిసైడింగ్ అధికారులు 1655 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 1655 అదర్ పోలింగ్ ఆఫీసర్లు 3910 సూర్యాపేట జిల్లాలో... మొత్తం పోలింగ్ స్టేషన్లు 1,091 ప్రిసైడింగ్ అధికారులు 1,309 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 1,309 అదర్ పోలింగ్ ఆఫీసర్లు 2,619 యాదాద్రి భువనగిరి జిల్లా.. మొత్తం పోలింగ్ స్టేషన్లు 552 ప్రిసైడింగ్ అధికారులు 663 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 663 అదర్ పోలింగ్ అధికారులు 1,325 -
టార్గెట్ తమిళ రాష్ట్రాలు
దక్షిణాదిపై కన్నేసిన కమలనాథులు టార్గెట్ తమిళనాడుగా ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరోసారి ఢిల్లీ గద్దెనెక్కించాలనే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సోమవారం పుదుచ్చేరి, మంగళవారం తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ♦ పార్టీ నేతలతో అమిత్‌షా కసరత్తు ♦ రాష్ట్రపతి ఎన్నికకు ఓట్ల సేకరణ, పార్టీ సమావేశాలు ♦ నేడు తిరువణ్ణామలైకి సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా దేశవ్యాప్త పర్యటనల్లో ఉన్న అమిత్‌షా తన 91వ రోజు మజిలీని పుదుచ్చేరిలో పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పుదుచ్చేరి చేరుకున్న అమిత్‌షా తమిళుల అత్యంత ప్రీతిపాత్రుడైన మహాకవి భారతియార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ నేతలు అమిత్‌షాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోటార్‌సైకిల్‌పై ర్యాలీగా నగరమంతా పర్యటించారు. ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే ప్రతిపక్ష స్థానంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో వీరి ఓటు ఎవరికనే స్పష్టత రాలేదు. అమిత్‌షాకు బీజేపీ నేతలు విందు ఏర్పాటుచేయగా పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఆర్ రంగస్వామి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం పాల్గొని రాష్ట్రపతి ఎన్నికలపై మద్దతు తెలిపారు. దీంతో అమిత్‌షా వచ్చిన పని కొంతవరకు నెరవేరినట్లయింది. ఆ తరువాత పుదుచ్చేరికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. డీఎంకే కాంగ్రెస్ పక్షాన ఉన్న కారణంగా అన్నాడీఎంకే మద్దతు కూడగట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే అన్నాడీఎంకే మూడుముక్కలుగా చీలిపోవడం బీజేపీకి నిరాశ కలిగించే అంశం. అన్నివర్గాలను విలీనం చేసేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా మూడువర్గాల మధ్య కక్షలు కార్పణ్యాలు మరింత పెరిగాయి. ఈ దశలో జయలలిత లేని లోటును అన్నాడీఎంకే తోడుగా బీజేపీ తీర్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చిన అమిత్‌షా ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతారో వేచి చూడాల్సి ఉంది. నేడు తిరువన్నామలైకి రాక పుదుచ్చేరి కార్యక్రమాలను పూర్తిచేసుకున్న అమిత్‌షా మంగళవారం తమిళనాడులోని తిరువన్నామలైకి హెలికాప్టర్లో చేరుకుంటారు. ఆయన రాక సందర్భంగా తిరువన్నామలైలోని అన్నామలై ఆలయం, ప్రభుత్వ కళాశాల, రమణ మహర్షి ఆశ్రమంల వద్ద ఎస్పీ పొన్ని నాయకత్వంలో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. -
కౌంటింగ్ ఆపాలని నేపాల్ మావోయిస్టుల పిలుపు.. ఎన్నికల్లో పరాజయం
నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎన్-మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రాథమిక ఫలితాల్లో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని మావోయిస్టులు కౌంటింగ్‌ను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో కుట్ర జరిగిందని, కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని ఆరోపించింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు కోరాయి. తాజా ఫలితాల్లో మావోయిస్టు చైర్మన్ ప్రచండకు ఘోర పరాభవం ఎదురైంది. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ చేతిలో ఓటమి చవిచూశారు. సుశీల్ కోయిరాలా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ 69, సీపీఎన్-యూఎంఎల్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా సీపీఎన్-మావోయిస్టు కేవలం 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నామని నేపాల్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నీల్కాంత ఉప్రేటి తెలిపారు. ప్రజాభిప్రాయన్ని గౌరవించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.