నిమ్మరసంతో సిరాను తొలగిస్తున్న చిత్రం
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు అక్కడ పనిచేయలేదు.. ఒక ఓటరు ఒక రోజు ఒకే రాష్ట్రానికి ఓటేయ్యాలని నిబంధన ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లలో కొందరు రెండు రాష్ట్రాలకు ఓటేసినట్లు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర పోలింగ్ బూత్ కేంద్రాలోనూ ఓటు హక్కును విని యోగించుకున్నారు. తమ ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న సిరా చుక్కను చెరిపేసి రెండో ఓటు కూడా వేశారు. ఈ సంఘటనలు పరందోళి, ముకదంగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో జరిగి నట్లు సమాచారం.
నిమ్మకాయతో చెరిపేసి..
ఓటర్లు వివిధ క్రియలతో రెండు ఓట్లను ఉపయోగించుకున్నారు. కొందరు తలకు నూనే రాసుకుని వచ్చారు. ఎన్నికల కేంద్రంలో అధికారులు వేలికి సిరాను అంటించంగా బయటికి వచ్చేసి ఆ వేలిని తలకు రాయడంతో సిరా కనిపించకుండా పోతుం ది. అలాగే కొందరు వేలికి అంటిన సిరాను నిమ్మకాయ రసంతో చెరిపేస్తున్నారు. ఇంకొందరు నిమ్మకాయ రసంలో నాన్చిన పుల్లతో సిరాను చేరి పేసి రెండో సారి ఓటు వేశారు. మిగిలిన కుటుం బాల్లో సగం తెలంగాణ, మరోసగం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. కెరమెరి మండలంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగిందని సమాచారం.
ప్రయాణానికి ఇబ్బంది పడిన ఓటర్లు
మండలంలో భోలాపటార్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రానికి రావాడానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక లేక కొందరు కాలినడకతో రాగా.. మరి కొందరు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకుని రావడం కనిపించింది. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరందోలి పోలింగ్ కేంద్రంలో (పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, శంకర్‌లొద్ది) ముకదంగూడలో (మహరాజ్‌గూడ, ముకదంగూడ) భోలాపటార్‌లో (భోలాపటార్, గౌరి, లేండిగూడ)అంతాపూర్‌లో (అంతాపూర్, ఏసాపూర్, నారాయణగూడ, ఇంద్రానగర్, పద్మావతి) గ్రామాలున్నాయి. మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల్లోనూ మన గ్రామాలున్నాయి. పరందోలి పోలింగ్ బూత్‌లో (ముకదంగూడ, లేండిజాల, కోటా, పరందోలి) వణిలో ( శంకర్‌లొద్ది), మహరాజ్‌గూడలో (మహారాజ్‌గూడ), భోలాపటార్‌లో (పలస్‌గూడ, ఏసాపూర్, లేండిగూడ, నారాయణగూడ, భోలాపటర్) పుడ్యాన్‌మొహదాలో (పద్మావతి, అంతాపూర్) గ్రామాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment