నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎన్-మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రాథమిక ఫలితాల్లో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని మావోయిస్టులు కౌంటింగ్ను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో కుట్ర జరిగిందని, కౌంటింగ్ను వెంటనే ఆపాలని ఆరోపించింది.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు కోరాయి. తాజా ఫలితాల్లో మావోయిస్టు చైర్మన్ ప్రచండకు ఘోర పరాభవం ఎదురైంది. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ చేతిలో ఓటమి చవిచూశారు. సుశీల్ కోయిరాలా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ 69, సీపీఎన్-యూఎంఎల్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా సీపీఎన్-మావోయిస్టు కేవలం 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నామని నేపాల్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నీల్కాంత ఉప్రేటి తెలిపారు. ప్రజాభిప్రాయన్ని గౌరవించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
కౌంటింగ్ ఆపాలని నేపాల్ మావోయిస్టుల పిలుపు.. ఎన్నికల్లో పరాజయం
Published Thu, Nov 21 2013 3:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement