సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న హెచ్ ఎస్ బ్రహ్మ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా హెచ్.ఎస్. బ్రహ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు.
దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే.