
ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ!
న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ గా ఉన్న వీఎస్ సంపత్ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీనియర్ అయిన హెచ్ ఎస్ బ్రహ్మను చీఫ్ కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి న్యాయశాఖ సిఫారసు చేసింది.
దీనికి ప్రధాని ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సివుంటుంది. 64 ఏళ్ల హెచ్ఎస్ బ్రహ్మ 1975 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేసే అవకాశముంది.