భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నసీం జైదీ | President appoints Dr Nasim Zaidi as Chief Election Commissioner | Sakshi
Sakshi News home page

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నసీం జైదీ

Published Thu, Apr 9 2015 11:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నసీం జైదీ

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నసీం జైదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సయ్యద్ నసీం అహ్మద్ జైదీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నహెచ్ ఎస్ బ్రహ్మ ఏప్రిల్ 18న  పదవి విమరణ చేయనున్నారు. దీంతో ఈ నెల 19 నుంచి కొత్త సీఈసీగా నసీం జైదీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

జైదీ పూర్తిపేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ.  1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్న ఆయన సీఈసీ పదవిని చేపడితే ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్లో కమిషనర్ పదవులు రెండీంటికీ ఖాళీ ఏర్పడినట్లవుతుంది. ఒక సభ్యుడు ఇదివరకే రిటైరయ్యారు. ఆయన ఈ పదవిలో జులై 2017 వరకు కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement