ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. వాళ్లు కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని.. ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు.