నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి నియమితులయ్యారు. ఆయన వచ్చే నెల (జూలై) 6న సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అచల్ కుమార్ జోతి గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్‌లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు.