భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా అచల్ కుమార్ జొతి నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్(సీఈసీ)గా అచల్ కుమార్ జొతి నియమితులయ్యారు. ఈ నెల 6న ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం సీఈసీగా ఉన్న నదీం జైది గురువారం పదవీ విమరణ చేయనున్నారు.
64 ఏళ్ల అచల్ కుమార్ 2015, మే నెలలో ఎన్నికల సంఘం కమిషనర్ నియమితులయ్యారు. ఆయన గుజరాత్ కేడర్‌కు చెందిన 1975 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్‌గానూ సేవలందించారు. 21వ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న అచల్ కుమార్ వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్, హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.