
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఇక్కడ సమావేశం కానున్నారు. రెండో సారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అయ్యే అవకాశాలున్నా యని సంబంధిత వర్గాలు తెలిపాయి.