
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ రాజకీయ పార్టీకి సహకరించేందుకు వీలుగా ఎన్నికల అధికారులు లక్షలాది బోగస్ ఓటర్లను నమోదు చేశారని తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదంతాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను నేతలు కోరారు. బీజేపీ సెంట్రల్ కో ఆర్డినేటర్ నూనె బాలరాజు, బీజేవైఎం నేత పొన్న వెంకటరమణ తదితరులు కమిషనర్‌ను కలసిన వారిలో ఉన్నారు.