Fake voter ID cards
-
ఈసీ వెబ్సైట్ హ్యాక్
సహరాన్పూర్/న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి అందులో 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీలను తయారు చేసిన విపుల్ సైని(24)ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) డిగ్రీ కలిగిన విపుల్ మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఈ పనులు చేయించినట్లు తెలిసిందన్నారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100–200 చొప్పున విపుల్ తీసుకున్నట్లు తేలింది. అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేశారు. -
ఐపీలు లేక అయోమయం
సాక్షి, సిటీబ్యూరో: ఓ నేరం జరిగింది, కేసు నమో దైంది, పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేశారు... అయినప్పటికీ కీలక నిందితులు చిక్కడం మాట అటుంచి కనీసం వారెవరన్నదీ గుర్తించడం సా«ధ్య ం కావడం లేదు... కీలక ప్రభుత్వ విభాగాల్లో ఉన్న వ్యవస్థాగత లోపాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. నకిలీ ఓటర్ ఐడీ కార్డులు పొందడానికి సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నమోదు చేసిన కేసు వ్యవహారమిది. ఆన్లైన్ ద్వారా ఓటరు గుర్తింపుకార్డులకు దరఖాస్తు చేసుకునే విధానంలో ఉన్న చిన్న లోపం కారణంగా ఈ కేసులో అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో కార్డుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల అధికారులే టార్గెట్‌గా... గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ ఓట్లు రిజిస్టరయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నాంపల్లి సహా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వీలున్నంత వరకు నకిలీ ఓటర్లను తొలగించింది. అయితే నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఫెరోజ్ ఖాన్ ఈ ఏడాది జనవరి 25న నకిలీ ఓటర్లకు సంబంధించి ఉదాహరణలు అంటూ రెండు పేర్లను బయటపెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఓవైసీ నగర్‌లోని చిరునామా నుంచి మాజీ సీఈసీ ఓమ్ ప్రకాష్ రావత్, ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ పేర్లు, ఫొటోలతో నమోదై ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఆధారాలుగా డబ్ల్యూఆర్‌హెచ్2400372, డబ్ల్యూఆర్‌హెచ్2400380 నెంబర్లతో ఓటర్ స్లిప్పులను సైతం చూపాడు. సీసీఎస్‌లో కేసు నమోదు... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. నగరానికి సంబంధించిన ఓటర్ జాబితాలు, నమోదు అంశాలను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సదరు అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీలోని 419, 465, 471 సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్‌లోని సెక్షన్ 31, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ రెండు పేర్లు నమోదుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు వచ్చినట్లు గుర్తించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు తమ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌ను చేర్చారు. అంతు చిక్కని ఐపీ అడ్రస్... ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీసీఎస్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓమ్ ప్రకాష్ రావత్, రజత్‌కుమార్‌ల పేర్లు, వివరాలతో ఓటర్‌కార్డుల కోసం వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులు ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయిందో తెలుసుకోవడంపై దృష్టి సారించారు. సాధారణంగా ఏ ఆన్లైన్ కార్యకలాపం/ లావాదేవీ అయినా కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుగుతుంది. వీటి నుంచి ఇంటర్నెట్ను వినియోగించినప్పుడు సంబంధిత ఐపీ అడ్రస్ కార్యకలాపం ఏ సంస్థకు చేరిందో అక్కడ నిక్షిప్తం అవుతుంది. అయితే ఓటర్ గుర్తింపుకార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సర్వర్‌లో మాత్రం ఇది నిక్షిప్తం అయ్యేలా ప్రొగ్రామింగ్ చేయలేదు. ఫలితంగా దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చినట్లు గుర్తించినా ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చాయో తెలియట్లేదు. ఈ కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై చార్జ్‌షీట్... ఈ ఐపీ అడ్రస్ తెలిస్తేనే దాని ఆధారంగా అది ఏ కంప్యూటర్/సెల్‌ఫోన్‌కు సంబంధించింది తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. ఆపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తేనే అసలు నిందితులను పట్టుకునే అవకాశం ఉంది. అయితే నకిలీ ఓటర్ గుర్తింపుకార్డుల వ్యవహారంలో ఐపీ అడ్రస్‌లే దొరక్కపోవడంతో దర్యాప్తు ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతో ఓటర్ ఐడీలు జారీ చేయాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు నేరుగా ఐడీలు జారీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు ఈ వ్యవహారంలో ఆయా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేల్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వారిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. వారు ప్రభుత్వ అధికారులు కావడంతో సర్కారు నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతి వచ్చిన తర్వాతే కోర్టులో చార్జ్‌షీట్ వేసేందుకు ఆస్కారం ఉంది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
బోగస్..సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం మాజీ చీఫ్, ప్రస్తుత ఉన్నతాధికారులను నాంపల్లి నియోజకవర్గ ఓటర్లుగా పేర్కొంటూ రిజిస్టర్ చేయించడం, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పొందడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ ఓట్లు రిజిస్టర్ అయ్యాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. నాంపల్లి సహా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వీలున్నంత వరకు నకిలీ ఓటర్లను తొలగించింది. అయితే నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్ జనవరి 25న నకిలీ ఓటర్లకు సంబంధించి ఉదాహరణలు అంటూ రెండు పేర్లను బయటపెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఓవైసీ నగర్‌లోని చిరునామా నుంచి మాజీ సీఈసీ ఓమ్ ప్రకాష్ రావత్, ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ పేర్లు, ఫొటోలతో నమోదై ఉన్నాయంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారాలుగా డబ్ల్యూఆర్‌హెచ్ 2400372, డబ్ల్యూఆర్‌హెచ్ 2400380 నెంబర్లతో ఓటర్ స్లిప్పుల్ని సైతం ఆయన ప్రదర్శించారు. దీంతో ఈ విషయం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. నగరానికి సంబంధించిన ఓటరు జాబితాలు, నమోదు అంశాలను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ అధికారుల్ని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ శనివారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీలోని 419, 465, 471 సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్‌లోని సెక్షన్ 31, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ గుర్తింపుపై దృష్టి... జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ రెండు పేర్లు నమోదుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు వచ్చినట్లు గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు తమ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌ను చేర్చారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఈ దరఖాస్తు ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో అనేక మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ దరఖాస్తు పరిశీలన, ఓటర్ జాబితాలో పేర్లు చేర్చడంలో వీరి నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణం పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తులు దురుద్దేశంతో, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భావిస్తున్నామని మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ అన్నారు. -
అధికారుల పేర నకిలీ ఓటరు ఐడీలు.. ఈసీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్ : నకిలీ ఓటరు ఐడీ కార్డుల విషయంపై భారత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల అధికారుల పేరుతో ఓటరు ఐడీ కార్టులు జారీ చెయ్యటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెహిదీపట్నంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేరుతో, మాజీ సీఈసీ ఒ.పి రావత్ పేరుతో ఓటరు ఐడీ కార్టులు జారీ అయ్యాయి. ఈ నకిలీ ఓటరు ఐడీ కార్డులపై జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఓటరు ఐడీ కార్డుల జారీపై సీసీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు. -
డబుల్ చీటింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అధికార పార్టీ పూర్తిగా అభాసుపాలు చేసింది. ప్రధానంగా అధికార పార్టీకి పట్టు ఉండే గ్రామాల్లో భారీగా డబుల్ ఎంట్రీలు నమోదు చేయించి ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉన్న ప్రాంతాల్లో రకరకాల కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. 2015 నాటి జాబితాతో పోలిస్తే కొద్దినెలల కిత్రం అధికారులు ప్రకటించిన జాబితాలో జిల్లాలో 2.05 లక్షల ఓట్లు తొలగించారు. వీటిలో అత్యధిక ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాలే కావటం గమనార్హం. డబుల్ ఎంట్రీల పేరుతో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన అధికార గణం ఇప్పుడు అధికార పార్టీ నేతలు డబుల్ ఎంట్రీ ఓట్లకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ముఖ్యంగా జిల్లాలో తాజా ఎన్నికల జాబితా ప్రకారం సుమారు ఇప్పటికే 35 వేలకు పైగా బోగస్ ఓట్లు నమోదుఅయినట్లు తెలుస్తోంది. గూడూరులోని వ్యక్తికి గూడూరు, నెల్లూరులో ఓట్లు నమోదు చేశారు. అలా ఒంగోలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని కొందరి ఓట్లు కూడా నెల్లూరు జిల్లాలో నమోదు చేసి ఉండటం విశేషం. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 2014 ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో బోగస్ పేరుతో పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి, వాటి స్థానంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను డబుల్ ఎంట్రీలు నమోదు చేయించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో వీటి ద్వారా లబ్ధి పొందాలని బలంగా యత్నాలు సాగిస్తున్నారు. ఉదాహరణకు షేక్ సర్దార్ అనే వ్యక్తికి నెల్లూరు నగరంలో నాలుగో పోలింగ్ బూత్‌లో ఓటు హుక్కు ఉంది. ఇదే సర్దార్కు మళ్లీ కోవూరులోని 126 నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. అలాగే పి.వెంకటేశ్వర్లకు నెల్లూరు నగరంలోని 16వ పోలింగ్ బూత్లోనూ సర్వేపల్లిలోని 202 పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. పై విధంగా ఒకటి రెండు కాదు.. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఒక్కో వ్యక్తికి సంబంధించి రెండేసి ఓట్లు చేర్చారు. గతంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటు భారీగా తొలగించారు. గతంలో బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికీ పరిశీలన సరిగా నిర్వహించేలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా నియోజకవర్గానికి చెందని వారిని కూడా తీసుకువచ్చి రెండేసి ఓట్లు నమోదు చేయిస్తున్నారు. -
ఓటు.. డూప్లికేటు!
ఓటు నమోదు.. సవరణ.. తొలగింపుల ప్రక్రియ పకడ్బందీగా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో రెండేసి, మూడేసి ఓట్లు ఉన్న వారు భారీ సంఖ్యలో ఉన్నారు. బోగస్ ఓట్లకు లెక్కేలేదు. వీటిలో కొన్నింటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రయత్నించినా.. అధికార పార్టీ అడ్డుపడుతోంది. తమ అధికారం చూపించి విపక్ష పార్టీలకు మద్దతు దారులుగా ఉన్న వారి పేర్లను మాత్రమే జాబితా నుంచి గల్లంతు చేస్తోంది. అందుకే ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండగా.. కొందరికి ఓటే లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అనంతపురం అర్బన్: ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు ప్రక్రియ అపహాస్యమవుతోంది. ఒక రకంగా ఓటు.. డూప్లికేటు చందంగా మారింది. జిల్లాలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనూ రాప్తాడు నియోజకవర్గంలో రెండేసి ఓట్లు ఉండడం గమనార్హం. ఇలా రెండు చోట్ల ఓటు కలిగి ఉండకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతున్నా.. ఆచరణలో అమలు కావడం లేదు. ఇక అధికారపార్టీకి చెందిన నాయకులు అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని ఓట్ల సవరణ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీవైఎస్సార్సీపీ ఓటర్లు లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగించేలా చేస్తున్నారు. ఇక తమ మద్దతుదారులకు మాత్రం రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. అందుకే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే దాదాపుగా 64 వేల ఓట్లు గల్లంతయ్యాయి. అర్బన్ నియోజకవర్గంలోనే ఎక్కువ అనంతపురం అర్బన్ పరిధిలో 2014 ఎన్నికల సమయంలో 2,54,236 ఓట్లు ఉంటే 64,592 ఓట్లు తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 1,89,644కు చేరింది. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన వారివే ఉన్నాయని సమాచారం. అదే తరహాలో తాడిపత్రిలోనూ 14,322 ఓట్లు, ధర్మవరంలో 10,475 ఓట్లు, కదిరిలో 7,757 ఓట్లు, హిందూపురంలో 3,426 ఓట్లు, పుట్టపర్తిలో 875 ఓట్లు, గుంతకల్లు నియోజకవర్గంలో 325 ఓట్లు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటు వాస్తవంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే నియోజవకర్గం పరిధిలో మాత్రమే ఓటు బదిలీకి అవకాశం ఉంటుంది. సదరు వ్యక్తి వేరొక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే... ముందుగా ప్రస్తుతమున్న ఓటును రద్దు చేయించుకుని, ఎక్కడైతే నివాసముంటున్నారో ఆ నియోజకవర్గంలో ఫారం–6 ద్వారా కొత్తగా ఓటరు నమోదుకు క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని కొందరికి ఒకే ఐడీ నంబరుతో రెండు జిల్లాల్లో ఓటు కార్డులున్నాయి. ఇలాగే జిల్లాలో పలువురికి రెండేసి నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్లోనూ, ఇతర జిల్లాలోనూ, ఇతర నియోజకవర్గాల్లోనూ ఒకరికి ఒకే ఐడీ మీద రెండు ఓట్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్‌లో ఓటు ఉన్నవారికి... అదే ఐడీపైన రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓటు ఉంది. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. జిల్లాలో ఎక్కువగా పక్కపక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఇలాంటి డబుల్ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఓటరు సవరణ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. యాడికి మండలం రాయలచెరువు గ్రామంలోని డోర్ నంబర్ 2–33ఏ బూత్ నంబర్ 56లో ఉన్న తెల్లాకుల శేఖర్ కుమార్తె అనూషకు తాడిపత్రి నియోజకవర్గంలో ఐడీ నంబరు ఐఎఫ్హెచ్ 1105122పై ఓటు కార్డు ఉంది. ఈమెను గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం గుత్తి ఆర్ఎస్ గ్రామానికి ఇచ్చి వివాహం జరిపించటంతో అక్కడ కూడా ఇంటి నంబర్ 19–1020లో పోలింగ్ బూత్ నంబర్ 217లో ఐఎఫ్హెచ్ 1105122 ఐడీపై ఓటు ఉంది. ఇలాంటి వారు ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా మంది∙ఉన్నారు. -
ఎక్కడ చూసినా కనిపిస్తున్న బోగస్ ఓట్లు
సాక్షి కడప : ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని ఢీ కొట్ట లేమనుకున్నారో..అరకొర తేడా ఉంటే మనమూ ముందుకు వరుసకు రావచ్చుకున్నారో తెలియదుగానీ దొంగ ఓట్లతో నెగ్గాలని టీడీపీ నేతలు వ్యూహం రచించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఎక్కడా చూసినా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ..ఒకే ఓటుకు కట్టుబడకుండా రెండు, మూడు చోట్ల ఓట్లు వేసేందుకు చేసిన పన్నాగం బట్టబయలైంది. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ బోగస్ ఓట్లు నమోదైనట్లు ఓటర్ అనలిస్ట్ అండ్ స్టాటజీ టీం (వాస్ట్) స్పష్టం చేసింది. దీంతో దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖం ఒకటి..ఓట్లు అనేకం కనిపిస్తున్నాయి. కొన్ని అడ్రస్సులు మార్చి ఒకే ఓటరు పలుచోట్ల ఓటు వేసుకునేందుకు నమోదు చేసుకున్న వైనం కూడా బహిర్గతమైంది. ఎందుకిలా చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో దొంగ ఓట్ల ద్వారా కనీసం డిపాజిట్లకు చేరువ కావచ్చని ‘దేశం’ నేతలు ప్రణాళికలు రూపొందించినట్లు చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఓట్ల రాజకీయం సాగుతోంది. ఓటు ఒకటి.. ఊర్లు రెండు జిల్లాలో 30,60,897 మంది జనాభా ఉన్నారు. ఇందులో 18,95,916 మంది ఓటర్లుగా నమోదయ్యారని సెప్టెంబరు 1న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ద్వారా తెలుస్తోంది. పాత జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు, మూడు, నాలుగుచోట్ల ఓట్లు ఉండడం...ఒకే ఐడీతో రెండుచోట్ల ఓట్లు..పేరు, ముఖం రెండూ ఒకటైనా..ఊర్లు వేర్వేరుగా చూపించారు. జిల్లాలో అలాంటి ఓట్లు సుమారు వేలల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధిని ఎన్నుకునే వ్యక్తికి సంబంధించి ఓటుహక్కు ఒకచోటే ఉండాలి. అది ఎక్కడైనా ఓటరు ఇష్ట్రపకారం ఉండవచ్చు.కానీ అలా కాకుండా రెండు, మూడు చోట్ల ఉండడం చూస్తే ఎలా జరిగిందన్నది అర్థం కావడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి దొంగ ఓట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతల వ్యూహం జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు ఓట్ల రాజకీయానికి తెర తీశారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలోనూ కడపకు వచ్చిన ఆర్డీఓ విషయంలో కూడా నేతలుఓట్ల మార్పులు, చేర్పుల విషయంలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది.అంతేకాకుండా కిందిస్థాయి అధికారులపై కూడా పెద్ద ఎత్తున ఓట్లు వైఎస్సార్ సీపీకి చెందినవి చేరకుండా చూడాలని ఒత్తిడి చేసినట్లు తెలియవచ్చింది. కనీసం తక్కువ తేడా వచ్చిన చోట ఈసారైనా పాగా వేయాలని టీడీపీ నేతలు కుయుక్తులు పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు రెండు నుంచి మూడు లక్షల మేర ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లతోపాటు ఇతర అనేక రకాల సమస్యలతో ఒకరికే రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. మచ్చుకు కొన్నిమాత్రం బయటికి కనిపిస్తున్నా...లోలోపల ఎన్ని ఉన్నాయో అర్థం కావడం లేదు. వార్డువార్డు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ఓట్ల గోల్మాల్ వ్యవహారం బయటికి వస్తుంది. గతంలో కూడా ఒక్క కడపలోనే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైన సంగతి తెలిసిందే. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే చాలా వరకు ఇలాంటి రెండు, మూడు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక నిబందనను తీసుకు వచ్చేలా కృషి చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఎందుకంటే పది కేటగిరీల్లో బోగస్ ఓట్లు నమోదైనట్లు వాస్ట్ స్పష్టం చేసిన నేపధ్యంలో జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
అధికార పార్టీ నేతల గిమ్మిక్కులు
కర్నూలు(అగ్రికల్చర్): అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం..నాలుగున్నర సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలేకపోయింది. తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకొని.. వచ్చే ఎన్నికల్లో అడ్డదారుల్లో విజయాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు బోగస్ ఓట్లను చేర్పిస్తున్నారు. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు జిల్లాలో 2,17,474 బోగస్ ఓటర్లు ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిన కొందరు అధికారులు అక్రమాలకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ ‘బోగస్’ సృష్టి: బోగస్ ఓటర్ల నమోదులో అధికార పార్టీ లీలలు అన్నీ ఇన్నీ కావు. ముఖం ఒక్కటే ఉన్నా..ఓట్లు మాత్రం మూడు, నాలుగు ఉంటున్నాయి. ఈ పరిస్థితి కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, పత్తికొండ, పాణ్యం, మంత్రాలయం తదితరనియోజక వర్గాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బోగస్ ఓట్లలో అనేక రకాలు ఉన్నాయి. ఒకే ఓటరు ఐడీపై ఒక వ్యక్తికి వేర్వేరు చోట్ల రెండు నుంచి మూడు వరకు ఓటర్లుగా ఉండటం, ఓటరు పేరు, తండ్రిపేరు మాత్రం మార్చి మిగిలిన వివరాలన్నీ ఒకేలా ఉంచి దొంగ ఓట్లు సృష్టించడం... ఇలా అనేక రకాలుగా బోగస్ ఓటర్లను అధికార పార్టీ సృష్టిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని గుట్టు చప్పుడు కాకుండా అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకే ముఖంతో వేరువేరు ఐడీ నంబర్లతో రెండు నుంచి మూడు వరకు ఓట్లు కలిగిన వారు జిల్లాలో వేలాదిగా ఉన్నారు. సెప్టంబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1.50లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సగానికిపైగా దరఖాస్తులను అధికార పార్టీ నేతలు పార్టీ కార్యాలయాల నుంచి అన్లైన్ ద్వారా అప్లోడ్ చేసినవే ఉన్నాయి. ఇందులో అత్యధికం బోగస్ ఓటర్లేనన్న విమర్శలు ఉన్నాయి. ఒకే వ్యక్తి ఫొటోతో వేరువేరు నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుగా నమోదు చేయించేందుకు దరఖాస్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. దరఖాస్తులను విచారించకుండా ఆమోదిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 62,757 మంది డూప్లికేట్ ఓటర్లు జిల్లాలో ఉన్న ఓటర్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్, మల్టిపుల్ ఓటర్లు 62,757 మందిని గుర్తించారు. వీరిపై బీఎల్ఓలు ఈ ఏడాది జూన్‌లో ఇంటింటికీ వెళ్లి వెరిఫై చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్న సమాచారం. ఇందులో 4,784 ఓటర్లు మాత్రమే డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించి తొలగించారు. డూప్లికేట్ ఓట్లన్నీ అధికార పార్టీకి చెందినవి కావడంతో తూతూమంత్రంగా విచారణ జరిపినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్లలో ఒకే ముఖంతో వేరువేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉన్న వారే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 18 ఏళ్లు పైబడి వారి జనాభా 25,97,593.... జిల్లాలో ఉన్న ఓటర్లు 27,57,094 జనాభాతో ఓటర్లను పోలిస్తే జిల్లాలో బోగస్ ఏ స్థాయిలో ఉన్నారో స్పష్టమవుతుంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం జిల్లాలో 18 ఏళ్లపైబడిన వారి జనాభా 25,97,593 ఉంది. 18 ఏళ్లు నిండిన వారే ఓటర్లుగా నమోదవుతారు. ఓటర్ల కూడా కొంత అటూ, ఇటూగా ఈ ప్రకారమే ఉండాలి. అయితే సెప్టంబరు1న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 27,57,094 మంది ఓటర్లు ఉన్నారు. జనాభతో పోలిస్తే ఓటర్లు 1,59,501 మంది ఎక్కువ( ఎక్సెస్)గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరందరూ డూప్లికేట్ ఓటర్లేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే మహిళకు రెండు ఓట్లు... కర్నూలుకు చెందిన దేశపోగు మాధవి అనే మహిళకు ఏకంగా మూడు ఓట్లు ఉన్నాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో వేరువేరు ఐడీ నంబర్లతో మూడు ఓట్లు ఉండటం గమానార్హం. ఒకే ఐడీ నంబరుతో ఉంటే పొరపాటున రిపీట్ అయినట్లు భావించవచ్చు. కాని వేరువేరు ఐడీ నంబర్లతో మూడు ఒకే మహిళ, ఒకే ఫొటోతో మూడు ఓట్లు కలిగి ఉండటం అధికార పార్టీ బోగస్ ఓట్లకు పరాకాష్టగా చెప్పవచ్చు. కర్నూలు నగరంలోని 115వ పోలింగ్ బూత్‌లో దేశపోగు మాధవికి ఎఊ2748168 ఐడీ నంబర్, సీరియల్ నంబర్ 995తో ఓటరు జాబితాలో పేరు ఉంది. ఇదే మహిళకు ఇదే పోలింగ్ కేంద్రంలో ఎఊ2739944 ఐడీతో, సీరియల్ నంబర్ 997తో ఓటు కల్పించారు. జడ్జీఎఫ్ 2739936 ఐడీ నెంబరులో 996 సీరియల్ నెంబరుతో ఓట్లు కల్పించారు. ఇటువంటివి ఈ పోలింగ్ కేంద్రంలో 10 వరకు ఉన్నాయి. ఫొటో ఒకటే.. వివరాలు వేరు కర్నూలు నగరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఒకే వ్యక్తి ఫొటోతో వేర్వేరు పేర్లు, వివరాలతో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటరుగా ఉన్నారు. 115వ పోలింగ్ కేంద్రంలో ఆదిశేషన్న అనే వ్యక్తి ఎఊ 2249432 ఐడీ నంబర్‌తో, సీరియల్ నంబర్ 666తో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇదే వ్యక్తి 116వ పోలింగ్ కేంద్రంలో ఎఊ2249028 ఐడీ నంబర్‌తో, సీరియల్ నంబర్ 320తో ఓటరుగా ఉండటం గమనార్హం. ఇటువంటి ఓటర్లు కర్నూలులో కుప్పలు తెప్పలుగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
బోగస్ ఓటర్లను తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ రాజకీయ పార్టీకి సహకరించేందుకు వీలుగా ఎన్నికల అధికారులు లక్షలాది బోగస్ ఓటర్లను నమోదు చేశారని తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదంతాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను నేతలు కోరారు. బీజేపీ సెంట్రల్ కో ఆర్డినేటర్ నూనె బాలరాజు, బీజేవైఎం నేత పొన్న వెంకటరమణ తదితరులు కమిషనర్‌ను కలసిన వారిలో ఉన్నారు. -
ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు
సాక్షి, బెంగళూరు : మరికొద్ది గంటల్లో (మే 12) పోలింగ్ జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. నకిలీ ఐడీ కార్డుల ఉదంతం నేపథ్యంలో బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర్ (ఆర్ఆర్ నగర్) నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడింది. మే 28 లేదా 31వ తేదీన పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కాగా రాజరాజేశ్వరి నియోజకవర్గంలో 9746 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు దొరికిన విషయం విదితమే. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్ట్మెంట్లో నకిలీ కార్డుల ప్రింటింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన ఆర్ఆర్ నగర్ పోలింగ్‌ను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అందరి చూపు కర్ణాటక వైపు... దేశంలో అందరి చూపు కర్ణాటక 15వ శాసనసభ ఎన్నికలపైనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకు జరుగనుంది. రాష్ట్రంలోని 223 నియోజకవర్గాలకు పోలింగ్ సాగుతుంది. అయితే శనివారం భారీ వర్షం పడుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు పోలింగ్ గడువును ఒక అర్ధ గంట పాటు పొడిగించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 2,5205,820 పురుష ఓటర్లు, 2,23,15,727 మంది మహిళా ఓటర్లు మరో నాలుగు వేల మందికి పైగా హిజ్రాలు తమ ఓటు హక్కును ఈ సారి వినియోగించుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రంలోని 60 పింక్ కేంద్రాలతో కలుపుకుని మొత్తం 58,808 కేంద్రాల్లో పోలింగ్ సాగుతుంది. దీంతోపాటు 73,185 కంట్రోల్ యూనిట్లు, 87,819 బ్యాలెట్ యూనిట్లు పోలింగ్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారు. మొత్తం 1,503 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎలాంటి ప్రలోభాలు జరుగకుండా, నిషేధిత వస్తువులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఎన్నికల సంఘం గట్టి భద్రత చర్యలు చేపట్టింది. పోటీలో మొత్తం 2,655 మంది.. బీజేపీ 223 స్థానాల్లో, కాంగ్రెస్ 222 స్థానాలు, జేడీఎస్ 201, బీఎస్సీ 18, సీపీఎం 19, ఎన్సీపీ 14 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 1,155 చోట్ల పోటీ చేస్తున్నారు. 2,436 మంది పురుషులు, 219 మంది మహిళా అభ్యర్థులతో కలుపుకుని మొత్తం 2,655 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కేఎస్ఆర్పీ, ఆర్ఏఎఫ్ కలుపుకుని 56,696 మంది భద్రతా దళాలు మోహరించాయి. రామనగర, కనకపుర, శికారిపుర, మాలకాల్మురు, బాదామి, బెళగావి, గోవిందరాజనగర తదితర సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఈ భద్రతా దళాలను ఎన్నికల సంఘం మోహరించింది.నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన ఉడుపి, శివమొగ్గ, మలేనాడు ప్రాంతంలో భద్రతను మరింత అధికంగా చేపట్టింది. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. రాష్ట్రంలోని బెంగళూరులో 1,595, బెళగావిలో 891, మైసూరులో 632, తుమకూరులో 528, దక్షిణ కన్నడ జిల్లాలో 483 కేంద్రాలతో కలుపుకుని మొత్తం 12,002 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని ఎన్నికల సంఘం నిర్ధారించింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్ సామగ్రితో సిద్ధంగా సిబ్బంది.. ఎన్నికల సిబ్బంది శుక్రవారం ఓటర్ల జాబితా, ఈవీఎం బాక్సు, వీవీప్యాట్ యంత్రంలను తీసుకుని తమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాగా, 224 నియోజకవర్గాలున్న శాసనసభ స్థానాలకు 223 చోట్ల మాత్రమే పోలింగ్ జరుగనుంది. బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో ఎన్నికల బీజేపీ అభ్యర్థి విజయకుమార్ హఠాత్తు మరణంతో ఆ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లను ఎన్నికల సంఘం అమలులోకి తీసుకొచ్చింది. ఓటర్ ఎవరికికి ఓటు వేశారో నిర్ధారిస్తూ వీవీప్యాట్ నుంచి స్లిప్ వస్తుంది. -
10 వేల ఓటరు కార్డులు; ఈసీ అప్రమత్తం
బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నకిలీ ఓటరు కార్డులు కలకలం సృష్టించడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కర్ణాటక ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా డిప్యూటీ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్‌ను నియమిస్తూ.. ఆయన్ని బెంగళూరుకు అత్యవసరంగా పంపించింది. మంగళవారం జరిగిన ఘటనపై విచారించి నివేదికను అందజేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి చేరుకున్న చంద్రభూషణ్ అదే పనిలో నిమగ్నులయ్యారు. బెంగళూరుకు చేరుకున్న చంద్రభూషణ్ అధికారులతో కలిసి ఘటనపై ఆరా తీశారు. త్వరగా విచారణ చేపట్టి నేడో రేపో నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో మంగళవారం అర్థరాత్రి దాదాపు 10 వేల నకిలీ ఓటరు గుర్తుంపు కార్డులు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘వాటి వెనకాల ఉన్నది మీ పార్టీవారే’నంటే.. కాదు మీ పార్టీ హస్తమే’ అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాగా అవి బోగస్ కార్డులు కావని, అసలైన కార్డుల్లాగే ఉన్నాయని ఈసీ తేల్చింది. అయితే అన్ని వేల కార్డులు ఒక్కచోట ఉండటమేంటన్న అంశంపై మాత్రం దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. -
నకిలీ ఓటరు కార్డుల కలకలం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కుతోంది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు దొరకటం సంచలనం సృష్టించింది. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్ట్మెంట్లో జరుగుతున్న నకిలీ కార్డుల ప్రింటింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఇవి అసలైన కార్డుల్లాగే కనబడుతున్నాయని అయితే విచారణలోనే అసలు విషయాలు వెల్లడవుతాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. ఓటర్లు వారికి ఓటేయకపోతే.. నకిలీ ఓటర్లను సృష్టిస్తారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడే ఈ రాకెట్ వెనక ఉన్నారు’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఇక్కడి ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. ఆ ఫ్లాట్ యజమాని మంజుల నంజమారి, పట్టుబడిన రాకేశ్‌లకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. అటు కాంగ్రెస్ బృందం ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వి వాదంలో కాంగ్రెస్‌ను క్షమించొద్దని మోదీ అన్నారు. -
10వేల నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం