
ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేరుతో, మాజీ సీఈసీ ఒ.పి రావత్ పేరుతో ఓటరు ఐడీ కార్టులు జారీ అయ్యాయి. ఈ నకిలీ ఓటరు ఐడీ కార్డులపై..
సాక్షి, హైదరాబాద్ : నకిలీ ఓటరు ఐడీ కార్డుల విషయంపై భారత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల అధికారుల పేరుతో ఓటరు ఐడీ కార్టులు జారీ చెయ్యటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెహిదీపట్నంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేరుతో, మాజీ సీఈసీ ఒ.పి రావత్ పేరుతో ఓటరు ఐడీ కార్టులు జారీ అయ్యాయి. ఈ నకిలీ ఓటరు ఐడీ కార్డులపై జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్ సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఓటరు ఐడీ కార్డుల జారీపై సీసీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు.
