వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ ఈసీలు జారీ.. ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే ఈసీలు
వైఎస్ జగన్ హయాంలో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా 540కిపైగా పౌర సేవలు
సాక్షి, అమరావతి: ఇళ్లు, భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ, రైతులు తమ వ్యవసాయ భూముల ఆధారంగా బ్యాంక్‌ల నుంచి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డ్యాకుమెంట్‌గా ఉండే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ల జారీ నాలుగైదు నెలలుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది.
ఇప్పుడు కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా మాత్రమే ఈ సేవలు పొందాలి్సన పరిస్థితి. రెవెన్యూ శాఖలో ఉండే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక అవాంతరాలు ఏర్పడి 2024 మార్చిలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులు ఏర్పడ్డాయి. మే నెలాఖరుకు ఆ వెబ్‌సైట్‌లో సాంకేతిక అవాంతరాలు పరిష్కరించబడినా ఇప్పటికీ ఆ సేవలను సచివాలయాల ద్వారా అందజేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
సచివాలయాల టాప్ సేవల్లో ఒకటి..
గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గత ఐదేళ్లూ ప్రజలకు అందిన 540 పైబడిన సేవల్లో అత్యధికంగా అందిన ప్రజలు వినియోగించుకున్న సేవలు ఈసీ సర్టిఫికెట్ల జారీ ఒకటని అధికార వర్గాలు తెలిపాయి. సచివాలయాల శాఖ గణాంకాల ప్రకారం..2022 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య 3,73,907 మంది గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీ సేవలను వినియోగించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం సచివాలయాల సేవల్లో టాప్–15 జాబితాలోనూ ఈసీల జారీ సేవ ఉండేదని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment