
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 9 మంది న్యాయమూర్తులు రేపు( మంగళవారం) ఉదయం 10.30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ జస్టిస్ ఎన్వీ రమణ.. కొత్త న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది.
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. కొత్తగా 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment