ఇన్‌చార్జి డీపీఆర్వోగా వనమోహనరావు
జిల్లా పౌరసంబంధాలశాఖ ఇన్‌చార్జి అధికారిగా సోమవారం సలాది వనమోహనరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీఆర్వోగా పనిచేసిన గోవిందరాజులు జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విజయవాడ డివిజనల్ పీఆర్వోగా పనిచేస్తున్న వనమోహనరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా పౌరసంబంధాలశాఖ ఇన్‌చార్జి అధికారిగా సోమవారం సలాది వనమోహనరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీఆర్వోగా పనిచేసిన గోవిందరాజులు జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విజయవాడ డివిజనల్ పీఆర్వోగా పనిచేస్తున్న వనమోహనరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మోహనరావు గోవిందరాజులు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్వోలు శ్రీనివాస్, అలీ తదితరులు పాల్గొన్నారు.