
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7 గంటలకు చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేశాక.. అంబర్‌పేటలో మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని శ్రీకనకదుర్గ దేవాలయంలో పూజలు చేస్తారు.
అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 11.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ హాజరవుతారు.