
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆర్.గాంధీకి ఆర్‌బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన గాంధీ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి నియామకం అమల్లోకి వచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. రామ సుబ్రమణ్యం గాంధీ ఎంపికకుగాను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు చేసిన ప్రతిపాదనను ఆర్‌బీఐ అనుమతించినట్లు తెలియజేసింది.
ఆర్థిక రంగ విధానాల నిపుణులు, సలహాదారుడైన గాంధీ 2014 నుంచి 2017 వరకూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. గతంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీలోనూ మూడేళ్లపాటు తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు.. ఐడీఆర్‌బీటీ(హైదరాబాద్)లోనూ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీలోనూ తొలినాళ్లలో సభ్యులుగా ఉన్నారు.
చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి!
Comments
Please login to add a commentAdd a comment