
సాక్షి, తిరుపతి: తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. టీటీడి పాలకమండలి చైర్మన్‌గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అనంతరం మొదటిసారి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శననంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ రెడ్డిని ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. సోమవారం తిరుమలలో జరిగే పాలకమండలి సమావేశంలో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ నెల 10 తేది టీటీడి నూతన అధ్యక్షుడుగా కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.