Bhumana Karunakar Reddy Takes Charge As A TTD Chairman - Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన బాధ్యతల స్వీకరణ

Published Thu, Aug 10 2023 11:30 AM | Last Updated on Thu, Aug 10 2023 3:59 PM

Bhumana Karunakar Reddy Takes Charge As A TTD Chairman - Sakshi

సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమల తిరు­పతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 12.30 నిమిషాలకు అన్నమయ్య భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఉదయం 9 గంటలకు పద్మావతి పురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.భూమనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. భూమన బాధ్యతల స్వీకరణ పథ్యంలో తిరుపతి నగరంలో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: సీఎం జగన్‌ హయాంలో గిరిజన జీవితాల్లో వెలుగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement