న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి బీమాను అందరికీ చేరువ చేసేందుకు.. లభ్యత, పొందడం, అందుబాటు అనే మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు అవుతున్నందున అప్పటికీ, బీమాను అందరికీ చేరువ చేయాలని ఐఆర్‌డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకు సంబంధించి గడిచిన ఏడాది కాలంలో పలు చర్యలు కూడా తీసుకుంది. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాండా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బీమా రంగంలో యూపీఐ తరహా విప్లవాన్ని తీసుకొచ్చేందుకు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిళ్లతో కలసి పనిచేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఓ ఊహాత్మక కార్యాచరణ గురించి ఆలోచించాం’’అని పాండా తెలిపారు. దేశంలో బీమా వ్యాప్తి తక్కువగా ఉండడం, పెద్ద మార్కెట్ కావడంతో ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment