బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్‌డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.
ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment