తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‍గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(వెంకట రమణ రెడ్డి) బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిందని.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
కాగా.. ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment