సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీజీపీఎస్సీ)గా ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం(నవంబర్30) ఉత్తర్వులు జారీ చేసింది.బురర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవ్వడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు రాజీనామా బుర్ర వేంకటేశం రాజీనామా చేయనున్నారు.ఇప్పటికే ఈయన వీఆర్‌ఎస్ అప్లై చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులవడం వల్ల సంతోషంగా ఉందని వెంకటేశం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment