దిగ్గజ వాహన తయారీ సంస్థ 'సుజుకి మోటార్ కార్పొరేషన్' (Suzuki Motor Corporation) మాజీ చైర్మన్ 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) డిసెంబర్ 25న తన 94ఏళ్ల వయసులో లింఫోమాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
జపాన్‌లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన ఒసాము.. సుజుకి వ్యవస్థాపక కుటుంబంలో వివాహం చేసుకున్న తర్వాత 1958లో ఆటోమేకర్‌లో చేరారు. తన భార్య ఇంటిపేరును తీసుకొని, ప్రపంచవ్యాప్తంగా చిన్న కార్లు & మోటార్‌సైకిళ్లను పరిచయం చేసి దాన్నే బ్రాండ్‌గా మార్చేశారు.
సుమారు నలభై సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన తర్వాత, ఒసాము సుజుకి 2021లో తన 91వ ఏట రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకంటే ముందు జూన్ 2015లో.. సుజుకి అధ్యక్ష పదవిని తన కుమారుడికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment