Suzuki Motor Corp
-
పెళ్లితో మలుపు తిరిగిన జీవితం: దిగ్గజ వ్యాపారవేత్తగా..
దిగ్గజ పారిశ్రామిక వేత్త 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) తన 94ఏళ్ల వయసులో ఈ రోజు (డిసెంబర్ 25) తుదిశ్వాస విడిచారు. జపనీస్ వ్యాపారవేత్త.. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అయిన ఈయన 2021లో పదవీ విరమణ చేశారు. ఇంతకీ ఈయన ప్రస్థానం ఎలా మొదలైంది? సుజుకి కంపెనీలోకి ఎలా వచ్చారు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.పెళ్లితో మలుపు తిరిగిన జీవితం1930 జనవరి 30న మత్సుడా.. షుంజో దంపతులకు జన్మించిన ఒసాము.. 1953లో చువో యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆ తరువాత బ్యాంకులో పనిచేశారు. అయితే 'మిచియో సుజుకి' (Michio Suzuki) మనవరాలు 'షోకో సుజుకి' (Shoko Suzuki)ని వివాహం చేసుకోవడంతో ఈయన జీవితం మలుపు తిరిగింది.సుజుకి కుటుంబంలో వారసులు లేకపోవడం వల్ల మిచియో సుజుకి.. ఒసాము కుటుంబంలో తన మనవారికి వివాహం చేశారు. జపనీస్ ఆచారాన్ని అనుసరించి ఒసాము.. సుజుకి ఇంటిపేరును స్వీకరించారు. దీంతో ఒసాము మత్సుడా.. ఒసాము సుజుకి అయ్యారు.జూనియర్ మేనేజ్మెంట్ నుంచి డైరెక్టర్ స్థాయికిఒసాము సుజుకి 1958లో సుజుకి మోటార్ కార్పోరేషన్లో చేరారు. కంపెనీలో జూనియర్ మేనేజ్మెంట్ పోస్టులతో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తూ.. 1963లో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 2000లో సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు.సుజుకి మోటార్ కార్పోరేషన్ అధిపతిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన.. ఒసాము సుజుకి ప్రపంచ ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతి తక్కువ కాలంలోనే సుజుకి కార్పొరేషన్‌ను ప్రపంచంలోని అతి పెద్ద చిన్న కార్ల తయారీదారులలో ఒకటిగా మార్చారు. చిన్న కార్ల మార్కెట్‌ను విస్తరించడం ద్వారా సుజుకి కంపెనీ గణనీయమైన పురోగతిని సాధించింది. సుజుకి కంపెనీని భారతదేశంలోని తీసుకొచ్చిన ఘనత కూడా ఒసాము సొంతం.యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశంసుజుకి మోటార్ కార్పోరేషన్ ఉనికిని విస్తరిస్తూ.. విదేశాలలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ప్రారభించారు. ఇలా ఏర్పడిన ప్లాంట్లలో మొదటిది థాయిలాండ్‌లో ఉంది. ఆ తరువాత ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లలో కూడా కంపెనీ ప్లాంట్స్ ఏర్పాటు అయ్యాయి. అదే సమయంలో జనరల్ మోటార్స్‌తో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన.. సుజుకి కార్పొరేషన్‌ను యూరోపియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జపాన్‌కు మాత్రమే పరిమితమైన సంస్థను ఒసాము నలుదిశలా వ్యాపింపజేశారు.31 దేశాలలో 60 ప్లాంట్లుఒసాము సుజుకి సారథ్యంలో ఎదిగిన కంపెనీ 21వ శతాబ్దం ప్రారంభం నాటికి 31 దేశాలలో 60 ప్లాంట్లను కలిగి ఉంది. సుమారు 190 దేశాలలో విక్రయాలను సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చిన్న కార్ల విభాగంలో మాత్రమే కాకుండా.. టూ వీలర్ విభాగంలో కూడా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!పారిశ్రామిక రంగంలో ఒసాము సుజుకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్'తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం.. సితార ఏ పాకిస్తాన్ అవార్డును ప్రధానం చేసింది. ఓ బ్యాంకు ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచమే గుర్తించేలా ఎదిగిన 'ఒసాము'.. పారిశ్రామిక రంగంలో ఓ ధ్రువతార అనే చెప్పాలి. -
దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నుమూత
దిగ్గజ వాహన తయారీ సంస్థ 'సుజుకి మోటార్ కార్పొరేషన్' (Suzuki Motor Corporation) మాజీ చైర్మన్ 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) డిసెంబర్ 25న తన 94ఏళ్ల వయసులో లింఫోమాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.జపాన్‌లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన ఒసాము.. సుజుకి వ్యవస్థాపక కుటుంబంలో వివాహం చేసుకున్న తర్వాత 1958లో ఆటోమేకర్లో చేరారు. తన భార్య ఇంటిపేరును తీసుకొని, ప్రపంచవ్యాప్తంగా చిన్న కార్లు & మోటార్‌సైకిళ్లను పరిచయం చేసి దాన్నే బ్రాండ్‌గా మార్చేశారు.సుమారు నలభై సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన తర్వాత, ఒసాము సుజుకి 2021లో తన 91వ ఏట రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకంటే ముందు జూన్ 2015లో.. సుజుకి అధ్యక్ష పదవిని తన కుమారుడికి అప్పగించారు. -
మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది. ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. వాటాదారుల వివరాలివీ... మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది.