కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య నిందితునిపై కొందరు దాడి చేసి హత్య చేశారు.
అక్టోబరు 4న బాధితురాలు పొలాల్లో ఆవులు, మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో అత్యాచార ఘటన జరిగిందని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పొలాల నుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లారని, ఆ తర్వాత మహిళ వివస్త్రగా కనిపించిందని, ఆమెకు విషం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నిందితుని ఇంటిపై దాడి చేసి, అతడిని బయటకు తీసుకుచ్చి దాడి చేశారు. మహిళలు, పురుషులు నిందితునిపై వెదురు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేలోపే నిందితుడిని స్థానికులు చావబాదారు. పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు బాధితుడు అప్పటికే మరణించాడని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: HYD: బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
Comments
Please login to add a commentAdd a comment