న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ.. ఇదే లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కస్టడీ పొడిగించడంతో ఆయన జూలై 25 వరకు జైలులోనే ఉండనున్నారు.
అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సుప్రీంతీర్పుపై ఆప్ సంబరాలు చేస్తోంది. బీజేపీ కుట్రలను న్యాయస్థానం బట్టబయలు చేసిందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ.. సత్యమేవ జయతే అంటూ కేజ్రీవాల్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్న చిత్రాన్ని ఆప్ షేర్ చేసింది.
हर सरकार की कोई ना कोई उपलब्धि होती है।
मोदी सरकार की सबसे बड़ी उपलब्धि यही है कि मोदी और अमित शाह अगर किसी को चुनाव में हरा नहीं सकते तो उसे फ़र्ज़ी केस में Jail में डाल देते हैं।
मैं मोदी और अमित शाह से यही कहना चाहता हूँ कि वो इस गंदी राजनीति को बंद कर दिल्ली और देश का समय… pic.twitter.com/9qt9IqFUH4— AAP (@AamAadmiParty) July 12, 2024
తీర్పు అనంతరం విలేకరుల సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీలో పాలన ఆపేందుకు సీఎం కేజ్రీవాల్‌ను తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ సర్కస్‌గా అభివర్ణించారు. బీజేపీ పన్నిన మద్యం కుంభకోణాన్ని సుప్రీంకోర్టు కూల్చివేసిందని ఆయన అన్నారు.
सत्यमेव जयते 🇮🇳 pic.twitter.com/dG5o2eHB0l
— AAP (@AamAadmiParty) July 12, 2024
అయితే ఆప్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు కోర్టు మాత్రమే ఇచ్చిందని, నిర్ధోషిగా విడుదల కాలేదని చురకలంటించింది. మధ్యంతర బెయిల్ పొందడం అంటే నేరం నుంచి విముక్తి పొందడం కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ముద్దాయి అని మొత్తం స్కాం వెనుక ఆయనే సూత్రధారి అని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను సీఎం లూటీ చేశాడని, సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment