సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో జూలై 22వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇక, లిక్కర్ కేసులో విచారణ కోసం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు జైలు అధికారులు. ఈ సందర్భంగా తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో(ల్యాడ్ టెస్టులు) వ్యత్యాసాలను కవిత న్యాయమూరి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో, కవితకు వైద్యపరీక్షలకు కోర్టు అనుమతించింది. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్టును కోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రెండు క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికావడంతో దీన్‌దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కాగా, కవితకు ప్రైవేటు ఆసుపత్రిలో చెకప్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దరఖాస్తు చేయడంతో కోర్టు దీనికి అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment