న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లినప్పటి నుండి 8.5 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. ఆప్ నేతల వ్యాఖ్యలపై తీహార్ జైలు అధికారులు స్పందిస్తూ కేజ్రీవాల్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్‌ను విడుదల చేశారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మద్యంతర బెయిల్ మీద బయటకొచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేశారు.
ఏప్రిల్ 1వ తేదీన తీహార్ సెంట్రల్ జైలు నెం.2లోకి ప్రవేశించిన రోజు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే మే 10 నుంచి జూన్ 2వరకు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. తాత్కాలిక బెయిల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు 64 కిలోలు. తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ 2న కేజ్రీవాల్ బరువు 63.5గా ఉంది. ఆయన, ప్రస్తుత బరువు 61.5కిలోలుగా ఉందని వివరణిచ్చింది.
తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం
కాగా, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం లేదా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తగ్గినట్లు అని జైలు వైద్యాధికారి చెప్పినట్లు జైలు నిర్వహాణ విభాగం అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌కు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని, జైలుకు చెందిన మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయనకు మందులు ఇస్తారని అని విడుదల చేసిన అధికారిక నోట్‌లో పేర్కొంది.
గతంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు 70 కిలోల బరువు ఉన్నారని, ఆ బరువు 61.5 కిలోలకు తగ్గిందని చెప్పారు.ఇలా బరువు పెరగడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు.
నిరంతరం వైద్యుల పర్య వేక్షణలో
జైలులో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ చాలాసార్లు పడిపోయిందన్న ఆప్ నేతల వాదనను తిప్పికొడుతూ ‘ప్రస్తుతం, కేజ్రీవాల్ బ్లడ్ షుగర్‌ను మెడికల్ బోర్డు సలహా మేరకు పర్యవేక్షిస్తున్నాం. బోర్డ్ సలహా మేరకు చికిత్స, ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. రక్తపోటు, బ్లడ్ షుగర్, బరువును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పిన తీహార్ జైలు అధికారులు.. రోజుకు మూడుసార్లు ఇంట్లో వండిన ఆహారాన్ని తింటున్నారని జైలు అధికారులు నివేదించారు.
నిరాధార ఆరోపణలు సరికాదు
ఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. అటువంటి ఆరోపణలు, తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. జైలు పరిపాలనను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీహార్ జైలు నివేదికపై స్పందించిన సంజయ్ సింగ్
తీహార్ జైలు నివేదికపై స్పందించిన ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ బరువు తగ్గారని, కేజ్రీవాల్ రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినట్లు పడిపోయిందని జైలు నివేదిక నిర్ధారిస్తుంది. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే, నిద్రలో కోమాలోకి జారిపోవచ్చు.బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అన్నారు.
ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ యూనిట్ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న వీరేంద్ర సచ్‌దేవా, ఆప్ నాయకులు కోర్టును తప్పుదోవ పట్టించడానికి, కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేలా చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment