సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో, కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనల అనంతరం కేజ్రీవాల్ కస్టడీని జూలై 25వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని కోర్డు పొడిగించింది. దీంతో, ఆయన మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Delhi Excise policy CBI case: Rouse Avenue Court has extended judicial custody of CM Arvind Kejriwal in the CBI case till July 25.
(file pic) pic.twitter.com/HpehzDbDE5— ANI (@ANI) July 12, 2024
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరు ముగ్గురే కీలకమని ఈడీ గట్టిగా వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment