లిక్కర్ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
తన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని, క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ రౌన్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అరెస్టుకు ముందు సీఎం కేజ్రీవాల్‌ను పరీక్షించే వైద్యులతో వర్చువల్ కన్సల్టేషన్‌ను అనుమతించాలని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఈడీ కస్టడీ సమయంలో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ 46కి పడిపోయిందని తెలిపారు.
అయితే కేజ్రీవాల్ అభ్యర్ధనను ఈడీ వ్యతిరేకించింది. తీహార్ జైల్లో అటువంటి రోగులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, అందులో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని వాదించింది.
నేను (కేజ్రీవాల్) నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంటే ఈడీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీంతో కేజ్రీవాల్ విజ్ఞప్తికి సమాధానం ఇచ్చేందుకు తమకు తగిన సమయం కావాలని ఈడీ తరుపు న్యాయ వాది కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటలకు రూస్ అవెన్యూ కోర్టులో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment