
సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.
కాగా, కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment