కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్‌: కేటీఆర్‌ | KTR Interesting Comments Over MLC Kavitha Bail | Sakshi
Sakshi News home page

కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్‌: కేటీఆర్‌

Published Fri, Aug 9 2024 3:16 PM | Last Updated on Fri, Aug 9 2024 6:25 PM

KTR Interesting Comments Over MLC Kavitha Bail

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారంలో బెయిల్‌ వస్తుందని చెప్పుకొచ్చారు ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. దీంతో, కేటీఆర్‌ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

కాగా, కేటీఆర్‌ తాజాగా మాట్లాడుతూ.. తీహార్‌ జైలులో ఉన్న కవిత ఆరోగ్యం క్షీణించింది. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కవిత బెయిల్‌ ప్రాసెస్‌ జరుగుతోంది. వచ్చే వారంలో బెయిల్‌కు వస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్‌ ఇప​్పిస్తుందనే వార్తలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్‌ స్కాం కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement