
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది.
మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేయాగా.. జూన్ 25న ఢిల్లీ హైకోర్టు ట్రాయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment