ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్‌నెట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.
సీఎం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఛీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు.
‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టుల్లో గ్లూకోమీటర్, సీజీఎంఎస్ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటరింగ్) వివరాల్లో తేడాలు ఉన్నాయి. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కేజీల బరువు తగ్గారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్ షుగర్ తగ్గుతోందని ఇటీవలే ఆప్ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...
ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాంటి లేటర్ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు.
‘ఎల్జీ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎల్జీపై సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment