ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది.
ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది.
అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment