Updates: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు
కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కానున్న కవిత
కవిత విడుదల ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ కోర్టు
షూరిటీ పత్రాలు సమర్పించిన కవిత భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర
రిలీజ్ వారెంట్ తో తీహార్ జైలుకు వెళ్లిన కవిత న్యాయవాదులు
తీహార్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
రోడ్లన్నీ జలమయం, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.
‘‘సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తైన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఈ మూడు ప్రధానాంశాల ఆధారంగా నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు.
కవిత బెయిల్‌కు షరతులు
ఒక్కో కేసుకు రూ.10 లక్షల పూచీకత్తు చొప్పున.. రెండు షూరిటీల సమర్పణ
పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సరెండర్ చేయాలి
సాక్షులను ప్రభావితం చేయకూడదు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణకు సహకరించాలి
కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు.. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. ఈడీ,సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యింది. దర్యాప్తు కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదు. సిసోడియాకు బెయిల్ ఇచ్చి కవితకు ఇవ్వకపోవటం సరికాదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది. ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. 5 నెలలకు పైగా ఈడీ కేసులో, 4 నెలలుగా సీబీఐ కేసులో కవిత జైలులో ఉన్నారు. రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ, సీబీఐ ఆరోపించాయి. కానీ, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు.
జస్టిస్ గవాయి వ్యాఖ్యలు..
కవిత నిరక్షరాస్యులు కాదు
ఏది మంచి,ఏది చెడు కాదో తెలియదా?
అప్రూవర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఉపసంహరించుకున్నారు?
కవిత దుర్బల మహిళ కాదు అని ఢిల్లీ హై కోర్టు అన్నది కదా
ఉన్నత స్థాయి మహిళ కు, దుర్బల మహిళకు తేడా ఉంది కదా ?
సీబీఐ వాదనలు.. కవిత తన ఫోన్‌లో డేటాను ఫార్మాట్ చేశారు. సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. కుట్రపూరితంగానే ఫోన్‌లో డేటా డిలీట్ చేశారు. గౌతమ్ గుప్తాతో చేసిన చాటింగ్‌ను డిలీట్ చేశారు.
ఈడీ తరపు వాదనలు.. కవిత సాక్షాలను ట్యాంపర్ చేశారు. యాపిల్ ఫోన్ ఫేస్ టైంలో డేటా ఎందుకు లేదు?. నాలుగు అయిదు నెలల నుంచి ఫోన్ వినియోగిస్తే అందులో డేటా ఎలా మాయం అయ్యింది?.
క్లిక్ చేయండి: కవిత అరెస్ట్ టూ బెయిల్
ధర్మాసనం వ్యాఖ్యలు..
ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేయటం సహజమే కదా: సుప్రీం కోర్టు
మెసేజ్‌లు డిలీట్ చేయడాన్ని ఎలా తప్పుబడతారు?
అరుణ్ పిళ్ళై తొలుత ఇచ్చిన వాంగ్మూలమే మేము పరిగణనలోకి తీసుకుంటాం
ఉపసంహరించుకున్న వాగ్మూలం పట్టించుకోం
ఈడీ తరఫు వాదనలు..
మెసేజ్‌లు డిలీట్ చేయటం కానీ ఫార్మాట్ చేయటం సహజం కాదు
కవిత బెదిరింపుల వల్లే పిళ్లై స్టేట్‌మెంట్ విత్‌డ్రా చేసుకున్నారు.
అరుణ్ పిళ్ళై 120రోజుల తర్వాత తన స్టేట్‌మెంట్ ఉపసంహరించుకున్నారు
కవితని విచారణకు పిలిచినప్పుడే అరుణ్ పిళ్ళై అప్రూవర్ స్టేట్‌మెంట్ ఉపసంహరించడం వెనుక ఎవరు ఉన్నారు?
కవిత, అరుణ్ పిళ్ళైలను కలిపి విచారణ జరుపుతాం అనగానే స్టేట్‌మెట్ రిట్రీట్ చేశారు
వంద కోట్ల రూపాయల కిక్ బ్యాగ్స్‌కు ఆప్ పార్టీకి ఇవ్వడంలో కవితది కీలకపాత్ర
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు
లిక్కర్ బిజినెస్‌పై అరవింద్ కేజ్రీవాల్‌ను కలిస్తే కవితను కలవమని చెప్పారు
కవితను కలిస్తే లిక్కర్ బిజినెస్ కోసం ఆప్‌కు వంద కోట్లు ఇవ్వాలని చెప్పారు
ఇందులో 50 కోట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇవ్వాలని కవిత చెప్పారు
ఈ డేటా మొత్తం ఫోన్ నుంచి డిలీట్ చేశారు.
ఈడీపై న్యాయమూర్తుల ఆగ్రహం
పిళ్లై సీబీఐ కస్టడీలో ఉంటే కవిత ఎలా బెదిరిస్తారు?
మీకు ఇష్టమొచ్చిన వాళ్లను సాక్షులుగా పెడతారా?
మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు
కవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారు?
జస్టిస్ గవాయి వ్యాఖ్యలు:
మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారు
ఇదేనా పారదర్శకత ?
బుచ్చిబాబు, ముత్త గౌతమ్ కేసులో నిందితులుగా ఉన్నారా ?
విచారణ పారదర్శకంగా జరుగుతోందా? పక్షపాతం లేకుండా ఉందా ?
మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం
దర్యాప్తు పూర్తి అయ్యింది
చార్జిషీట్ ఫైలింగ్ పూర్తి అయ్యింది కదా
493 మంది సాక్షుల విచారణ ఇప్పుడే పూర్తి కాదు
సుప్రీం తీర్పుపై బీఆర్‌ఎస్ హర్షం
కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. తీర్పు అనంతరం ఆటోలో వాళ్లు వెళ్లిపోయారు. అయితే.. సాక్షి టీవీతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. ‘‘సాయంత్రం కల్లా కవిత బెయిల్‌పై బయటకు వస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత వ్యతిరేకంగా ఇలాంటి సాక్షాలు లేవు. ఇన్నాళ్లకు మా న్యాయపోరాటం ఫలించింది. జైల్లో కవిత ఇబ్బందులు పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment