22న విచారిస్తామన్న రౌజ్‌ఎవెన్యూ కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంతోపాటు తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రౌజ్‌ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 22కు విచారణను వాయిదా వేశారు. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, సీబీఐ చార్జిïÙట్‌లో తప్పులున్నాయని కవిత తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ.. తప్పులు లేవన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జిషీట్‌లో తప్పులపై విచారణ జరిగేవరకు చార్జిïÙట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయి దా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టు కు విజ్ఞప్తి చేశారు. అయితే.. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబంధం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కాగా, ‘60 రోజుల తర్వాత తప్పులతో కూడిన చార్జిïÙట్‌ను దాఖ లు చేయడం తన క్లయింట్ డిఫాల్ట్ బెయిల్ హక్కులను కాలరాయడమే’అని కవిత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనల అనంతరం 22న కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment