కవితకు బెయిల్‌.. బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Bandi Sanjay Congratulations To Congress Over Kavitha Bail KTR Reacts On It, Posts Goes Viral | Sakshi
Sakshi News home page

MLV Kavitha Bail: కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌.. బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Tue, Aug 27 2024 3:40 PM | Last Updated on Tue, Aug 27 2024 7:01 PM

Bandi Sanjay Congratulations Congress Over Kavitha Bail

హైదరాబాద్‌,సాక్షి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఎక్స్‌ వేదికగా పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్‌ వచ్చిందంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ​

దానికి కౌంటర్‌ ఇచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. న్యాయ స్థానం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరారు.

 కవితకు బెయిల్‌ రావడంపై అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ శుభాంకాంక్షలు చెప్పారు. అటు బీఆర్‌ఎస్‌ వ్యక్తికి బెయిల్‌. ఇటు కాంగ్రెస్‌ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒకేసారి వచ్చాయని పేర్కొన్నారు. కవిత బెయిల్‌ కోసం వాదనలు వినిపించిన వ్యక్తిని రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్‌ చేయడంలో కేసీఆర్‌ రాజకీయ చతురత చూపించారని విమర్శించారు.వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేశారు బండి సంజయ్‌.

అయితే బండి సంజయ్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తే సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని కోర్టు ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను ఎక్స్‌ ద్వారా కోరారు కేటీఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement