ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ | K Kavitha Moves Delhi High Court Seeking Bail In Liquor Policy Case, Hearing Today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌

Published Fri, May 10 2024 5:30 AM | Last Updated on Fri, May 10 2024 10:48 AM

K Kavitha Moves Delhi High Court Seeking Bail In Liquor policy case

నేడు విచారణ 

 సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్‌ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్‌ కోర్టు (రౌజ్‌ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement