CBI custody
-
కోల్‌కతా కేసు: ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో ఘోష్ సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా కోర్టు సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. కాగా, మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. మాపైనే నిందలా..? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్: ప్యాంట్ బెల్ట్‌కు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో అవినీతి వ్యవహారం జరిగిందని, ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు సంస్థ అంటోంది. అయితే.. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.ఇంటి భోజనానికి అనుమతించాలని, అలాగే.. కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు. అలాగే.. ప్యాంట్ బెల్ట్ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని, జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని, కాబట్టి దానిని కూడా అనుమతించాలని కోరారాయన. వీటన్నింటికి కోర్టు అనుమతించింది. ఈ విజ్ఞప్తులతో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసన అనంతరం కేజ్రీవాల్‌ను జూన్ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్‌లో కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను.. విచారణ జరిపి మరీ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు.. కొత్త పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. అరెస్టు ఇప్పుడే ఎందుకంటే.. తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్‌ట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు. బయటకు రాకుండా కుట్రలు: సునీతా తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
నేడు ప్రత్యేక కోర్టు ముందుకు కవిత
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం పది గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశ పెట్టనున్నారు. ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోను ద్వారా సేకరించిన చాట్లు, మహబూబ్‌నగర్‌లో భూమి ఒప్పందం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా సొమ్ములు చేర్చడం, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడడం తదితర అంశాలపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలు నిరాకరించింది. రెగ్యులర్ బెయిలుపై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
లిక్కర్ కేసు: కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో.. ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ ములాఖత్ కొనసాగింది. కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ ఉన్నారు. ఇక.. ములాఖత్ ముగిసిన అనతంరం మీడియాతో మాట్లాడటాన్ని కేటీఆర్ నిరాకరించారు. లాయర్లతో చర్చించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. ఇక.. ఆదివారం(ఏప్రిల్ 14) కవితను కలిసేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. రేపటితో కవిత సీబిఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు అప్పచెప్పారని సీబీఐ అభియోగం. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్‌పై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. కవిత విచారణను సీబిఐ వీడియో రికార్డు చేస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ శనివారం విచారణను ప్రారంభించింది. ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. రూ.100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను శుక్రవారం సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా శనివారం సీబీఐ కవితను ప్రశ్నించింది. -
నేటి నుంచి కవితను విచారించనున్న సీబీఐ
-
సీబీఐ కస్టడీకి షాజహాన్ షేక్
కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత షాజహాన్ షేక్‌ను సీబీఐ అధికారులు ఎట్టకేలకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. అతడిని తక్షణమే సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు రెండుసార్లు ఉత్తర్వులు జారీ చేయడంతో పశి్చమ బెంగాల్ సీఐడీ అధికారులు స్పందించక తప్పలేదు. బుధవారం సీబీఐ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తును, నిందితుడు షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మంగళవారమే కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయినా పశి్చమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మరోవైపు కలకత్తా హైకోర్టులో ఈడీ బుధవారం మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాటి ఉత్తర్వును అమలు చేయాలని, షాజహాన్ షేక్‌ను సాయంత్రం 4.15 గంటలకల్లా సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందం బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. సీఐడీ అధికారులు సాయంత్రం 6.48 గంటలకు షాజహాన్ షేక్‌ను సీబీఐ బృందానికి అప్పగించారు. అంతకంటే ముందు అతడిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. కరడుగట్టిన నేరగాడిగా ముద్రపడిన షాజహాన్ షేక్‌పై సందేశ్‌ఖాలీలో దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా స్పందించారు. -
ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి సీబీఐ కస్టడీ..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డిహత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం ఇద్దరిని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు వైఎస్ భాస్కర్‌రెడ్డికి.. 26 వరకు ఉదయ్‌కు సీబీఐ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్‌ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు. -
Manish Sisodia: నేడు కోర్టుకు సిసోడియా
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీ ఇవాళ్టితో(సోమవారం) ముగియనుంది. దీంతో.. దర్యాప్తు సంస్థ ఆయన్ని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సిసోడియాను సీబీఐ విచారరించేందుకు తొలుత ఐదు రోజులు, ఆ తర్వాత రెండు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, ఆ టైంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, ముడుపులు,మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన, నిందితులతో ఉన్న సంబంధాలపై .. తదితర అంశాలపై వారంగా ఆయన్ని సీబీఐ ప్రశ్నించింది. అయితే.. ఆయన కస్టడీ పొడగింపును సీబీఐ మరోసారి కోరే అవకాశం కనిపించడం లేదు. బదులుగా ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని కోరవచ్చని సమాచారం. మరోవైపు సీబీఐ పదే పదే వేసిన ప్రశ్నలతోనే తనను మానసికంగా వేధిస్తోందని, బెయిల్ ఇప్పించాలని కోరుతూ 51 ఏళ్ల సిసోడియా కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అభ్యర్థించగా.. పిటిషన్‌ను తోసిపుచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టును సంప్రదించాలని సిసోడియాకు సూచించింది. -
బోయినపల్లి అభిషేక్‌రావు సీబీఐ కస్టడీ మరో 2 రోజులు పొడిగింపు
-
సీబీఐ కస్టడీకి సునీల్‌కుమార్ యాదవ్
సాక్షి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. సునీల్ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది. కాగా, అతడిని తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 16 వరకు సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం పులివెందుల మేజిస్ట్రేట్ అనుమతించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కడప కేంద్ర కారాగారం నుంచి సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర కారాగారం ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయానికి సునీల్‌కుమార్ యాదవ్‌ను తీసుకెళ్లారు. కాగా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాలను సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కస్టడీకి సునీల్ యాదవ్
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద హత్య కేసులో భాగంగా సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు సునీల్ యాదవ్‌ను 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
చిదంబరంను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఎయిరిండి యాకు నష్టం కలిగించేలా వ్యవహరించి, మనీ లాండరింగ్‌కు పాల్ప డ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరానికి ఈడీ గతేడాది ఆగస్టు 23న సమన్లు జారీచేసింది. అయితే ఆ సమయంలో ఆయన ఐఎన్ఎక్స్ మీడియాలో అవినీతి కేసుకు సంబంధించి అరెస్టు అయి సీబీఐ కస్టడీలో ఉన్నారు. -
చిదంబరం కేసులో 5న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది. చిదంబరం అరెస్టు శుభవార్తే: ఇంద్రాణి చిదంబరం అరెస్టుపై ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణిని గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అన్ని వైపుల నుంచి కట్టడి చేశారని అన్నారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి అప్రూవర్‌గా మారడం తెల్సిందే. -
చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను మరో నాలుగు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు సీబీఐకి అనుమతించింది. చిదంబరం నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని మరో 5రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వినతి న్యాయబద్ధంగా ఉందన్న స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ 30వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది. ఇదే కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పటికే(ఆగస్టు 21) చిదంబరం అరెస్టయినందున దీనిపై విచారణ నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో చట్టబద్ధమైన పరిష్కారం కోరే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొంది. దీంతో ఈడీ కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం(రీజాయిండర్) ఇస్తామని చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తెలిపారు. నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని, చిదంబరం ప్రాథమిక హక్కులను న్యాయస్థానం కాపాడాలని పేర్కొన్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌తోపాటు ఇదే కేసులో దిగువ కోర్టు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయడం, సోమవారం వరకు సీబీఐ కస్టడీకి పంపాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై కోర్టు బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన తన పిటిషన్‌ను జూలై 20, 21వ తేదీల్లో సుప్రీంకోర్టు విచారించక పోవడం వల్లే ఆగస్టు 21వ తేదీన అరెస్టయ్యానని చిదంబరం తెలిపారు. ఈ చర్యల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మనీలాండరింగ్ కేసులో సోమవారం వరకు చిదంబరంను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. చిదంబరం పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ..దీని వెనుక భారీ మనీలాండరింగ్ కుట్రకోణం ఉందని తెలిపారు. -
సీబీఐకి ఓకే.. ఈడీకి నో!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరాన్ని ఈ నెల 26వ తేదీ (వచ్చే సోమవారం) వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే ఇదే కేసులో చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నా రు. విచారణను ఎదుర్కొంటున్నారు కూడా!!. సీబీఐ కస్టడీ కూడా ఆగస్టు 26నే ముగుస్తుండటం తో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. నిజానికి చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దంటూ ఈడీ వాదించినా, కోర్టు వారి వాదనను తిరస్కరించింది. ఈడీ, సీబీఐలు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలన్న చిదంబరం అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20న తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం తెలిసిందే. అలాగే తనను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఆగస్టు 26న విచారణ జరుపుతామనీ, అప్పటివరకు చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్.బోపన్నల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల అన్ని లావాదేవీలూ, చెల్లింపుల వివరాలు ఇవ్వాలంటూ బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మారిషస్, బెర్ముడాలకు సీబీఐ లెటర్ రొగేటరీలను (ఎల్ఆర్) పంపింది. సోమవారమే ఆ పత్రాలు ఇవ్వండి: జడ్జీలు ఈ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చిదంబరం తరఫున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. మెహతా మరికొన్ని పత్రాలను సీల్డు కవర్లో జడ్జీలకు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ పత్రాలను చదివాక న్యాయమూర్తులు తమ అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మెహతా చర్యను సిబల్ వ్యతిరేకించారు. హైకోర్టులోనూ వాదనలు పూర్తయిన తర్వాత ఈడీ మరిన్ని పత్రాలను జడ్జీలకు అందజేసిందన్నారు. దీంతో మెహతా ఇచ్చిన పత్రాలను చదివేందుకు జడ్జీలు నిరాకరించారు. ఆ పత్రాలను సోమవారమే ఇవ్వాలని చెప్పారు. విదేశాల్లో 11 ఆస్తులు, 17 బ్యాంకు ఖాతాలు చిదంబరం విదేశాల్లో 11 చోట్ల ఆస్తులను కూడబెట్టారనీ, 17 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని మెహతా తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిధులు అందుకునేందుకు ఎఫ్ఐపీబీ ఆమోదం తీసుకునే విషయమై ఐఎన్ఎక్స్ గ్రూప్ ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా, తన కుమారుడిని ‘జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చిదంబరం వారితో అన్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. ‘అరెస్టు నుంచి రక్షణ కల్పించి విచారిస్తే చిదంబరం నిజాలు చెప్పరు. మోసం వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఆయనను కస్టడీలో ఉంచుకునే విచారించాలి. డొల్ల కంపెనీలను సృష్టించిన అనేకమంది చిదంబరం మనవరాలి పేరిట వీలునామా రాశారు. వీటిపై ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన కోర్టుకు చెప్పారు. గతంలో చిదంబరాన్ని విచారించినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని మెహతా అన్నారు. కోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు సిబల్ వాదిస్తూ ఈడీ సమర్పించిన ఓ నోట్లోని మొత్తం సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా హైకోర్టు రికార్డులోకి తీసుకుని చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరించిదనీ, అందులోని సమాచారంపై తామకు వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. సింఘ్వీ వాదిస్తూ ‘ఆగస్టు 20న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును తిరస్కరిస్తూ, ఆర్థిక నేరగాళ్లు ముందస్తు బెయిలు పొందకుండా చట్టాలను పార్లమెంటు సవరించాల్సిన సమయం వచ్చిందని జడ్జి అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఐఎన్ఎక్స్తో సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసును ఆ రోజు జడ్జి ప్రస్తావించారు. అసలు సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసు గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అంటే ఐఎన్ఎక్స్ కేసులో బెయిలు ఇవ్వకూడదని ఆ జడ్జి ముందుగానే అనుకున్నారు’ అని సుప్రీంకోర్టుకు తెలిపారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది. ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం, ఆయన కొడుకు కార్తీలను అరెస్టు చేయకుండా ఉన్న తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు సెప్టెంబరు 3 వరకు పొడిగించింది. ముందస్తు బెయిలు కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఆదేశాలను కూడా సెప్టెంబర్ 3 వరకు రిజర్వ్‌లో ఉంచింది. అయితే ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. చిదంబరం, కార్తీలకు సంబంధించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, విచారణను వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ కోరాయి. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘పరిస్థితులు నాకు చాలా ఇబ్బందికరంగా మారాయి. ప్రతిరోజూ మీరు ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? దాదాపు సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారు’ అని మందలించారు. చిదంబరానికి ముందుస్తు బెయిలు అంశంలో ఆయనకు వ్యతిరేకంగా వాదనలేమైనా ఉంటే, వాటిని వినిపించేందుకు కోర్టు సెప్టెంబరు 3 వరకు సీబీఐ, ఈడీలకు గడువు ఇచ్చింది. రిజర్వ్‌లో ఉంచిన ఆదేశాలను సెప్టెంబరు 3న వెలువరిస్తామంది. -
సీబీఐ కస్టడీకి..చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్ కుమార్ చౌహాన్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ స్పష్టం చేశారు. చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. జవాబులను దాటవేస్తున్నారు.. ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. వాదనలు ఇలా.. సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) ► ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన భాస్కర్ రామన్. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి. ► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ► బెయిల్ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. ► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు. ► ఈ కేసు అంతా అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది. ► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు. ► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు. ► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు. ► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు. ► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు. ► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది. సొలిసిటర్ జనరల్ తుషార్ (సీబీఐ తరఫున) ► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం. ► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. ► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి. ► ఇది చాలా సీరియస్ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది. ► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం. ► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి. ► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం. ► చట్టం ముందు అంతా సమానమే. ► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ► చిదంబరం ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది. ► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం. 4 గంటలు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు, ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది. అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు. వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు కోర్టు ముందు భారీ బందోబస్తు కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం -
ఎవరీ మైకేల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదా! మైకేల్‌ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. సల్వార్కమీజ్లో పారిపోయేందుకు యత్నం! భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్‌కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో దుబయ్‌లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్‌ను భారత్‌కు అప్పగించింది. ఎవరీ మైకేల్? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్ చేయండి’
న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్‌కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్ అయిపోయాయి'' అని తెలిపారు. 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్రూమ్ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా హౌజ్‌కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్ ముఖర్జీని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కార్తీకి మరో మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ స్థానిక కోర్టుల్లోనూ ఊరట లభించలేదు. ఆయన సీబీఐ కస్టడీని ఢిల్లీ స్థానిక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. బెయిల్ పిటిషన్‌ను సైతం వాయిదా వేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కార్తీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మంగళవారం అతడిని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయమూర్తి సునీల్‌రాణా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో కార్తీ పాత్రపై వాస్తవాలు తెలియాలంటే విచారణ తప్పనిసరి అని, అందువల్ల కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. కార్తీని ముంబై తీసుకువెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారించాల్సి ఉందని, ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఓ కీలక ఆధారమని విజ్ఞప్తి చేసింది. -
కార్తీ చిదంబరానికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయనను అయిదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఢిల్లీ పటియాలా కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా కార్తీ చిదంబరాన్ని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని సీబీఐ అధికారులు కోరినప్పటికీ ...న్యాయస్థానం మాత్రం మార్చి 6వ తేదీ వరకూ కస్టడీకి అనుమతించింది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. రిమాండ్ సమయంలో రోజుకు రెండు గంటలు న్యాయవాదిని కలుసుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రిస్క్రిప్షన్‌లోని మెడిసిన్స్ తీసుకోవచ్చని..అయితే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించబోమని తెలిపింది. అంతకుమందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. నిందితుడిని సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని..తాము సమీకరించిన ఆధారాలపై అతడిని ప్రశ్నించాల్సి ఉందని అంటూ కార్తీని కనీసం 14 రోజుల పాటు విచారించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కార్తీ తల్లి, సీనియర్ అడ్వకేట్ నళినీ చిదంబరం కోర్టులో కుమారుడి పక్కనే కూర్చున్నారు.మరోవైపు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కార్తీ పేర్కొంటున్నారు. సీబీఐ తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా ఇప్పుడు విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత సింఘ్వీ అన్నారు. ఈ కేసులో కార్తీకి వ్యతిరేకంగా తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ చెబుతోంది. చిదంబరాన్ని కూడా ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అత్యాచారం కేసులో.. మాజీ మంత్రికి సీబీఐ కస్టడీ
అత్యాచారం కేసులో రాజస్థాన్ మాజీ మంత్రి బాబూలాల్ నాగర్‌ను సీబీఐ కస్టడీకి తరలించారు. శనివారం ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఆయనను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని నాగర్ న్యాయవాది వెల్లడించారు. రాజస్థాన్ పాడి, గ్రామీణ పరిశ్రమల మంత్రిగా ఉన్న 53 ఏళ్ల నాగర్పై ఇటీవల అత్యాచార ఆరోపణలు రావడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. శుక్రవారం సీబీఐ అధికారులు ఆయనను ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి పిలిపించుకుని తనపై అత్యాచారం చేసినట్టు ఓ 35 ఏళ్ల యువతి గత నెలలో బాబూలాల్పై కేసు దాఖలు చేసింది. -
సీబీఐ కోర్టులో విజయమ్మ, భారతి మెమో దాఖలు