విలేజ్‌...సెట్‌...గో... | Ram Charan RC16 Movie Pre Production Update | Sakshi
Sakshi News home page

విలేజ్‌...సెట్‌...గో...

Published Sat, Jun 1 2024 2:39 AM | Last Updated on Sat, Jun 1 2024 2:39 AM

Ram Charan RC16 Movie Pre Production Update

గెట్‌... సెట్‌... గో అంటారు. అయితే రామ్‌చరణ్‌ విలేజ్‌... సెట్‌... గో అంటూ పల్లెటూరికి వెళ్లనున్నారు. విలేజ్‌లో స్పోర్ట్స్‌ ఆడేందుకు రెడీ అవుతున్నారు రామ్‌చరణ్‌. ఆయన హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారట.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చిత్రీకరణకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో విలేజ్‌ సెట్‌ను రెడీ చేయిస్తున్నారు మేకర్స్‌. ఈ సెట్‌ పూర్తి కాగానే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. మేజర్‌ షూటింగ్‌ ఈ విలేజ్‌ సెట్‌లోనే ప్లాన్‌ చేశారట. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ కానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇదిలా ఉంటే... దర్శకుడు బుచ్చిబాబు తండ్రి గురువారం మరణించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement