
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బుచ్చిబాబు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే! ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉప్పెన. ఫస్ట్ చిత్రంతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
చదవండి: 45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం!
Comments
Please login to add a commentAdd a comment