
నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటిదాకా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన ఈయన 45 ఏళ్ల వయసులో మ్యారీడ్ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇందు అనే అమ్మాయి మెడలో ప్రేమ్‌జీ మూడు ముళ్లు వేయనున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా పెళ్లిరోజు ఇదేనంటూ ఓ వివాహ పత్రిక నెట్టింట ప్రత్యక్షమైంది.
ఆరోజే పెళ్లి
ఇందులో జూన్ 9న తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తని మురుగన్ ఆలయంలో వివాహం జరగనున్నట్లు రాసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించినందుకు సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నిజంగా అతడి పెళ్లి కార్డేనా? లేదంటే అతడి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ స్టంటా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాదే పెళ్లి
ప్రేమ్‌జీ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమేనని ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నానని నటుడే స్వయంగా జనవరిలో చేసిన ఓ పోస్టులో వెల్లడించాడు. ప్రేమ్‌జీ సినిమాల విషయానికి వస్తే అతడి సోదరుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ప్రేమ్‌జీ ఉన్నాడు. కస్టడీ, ప్రిన్స్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు.
Happy new year. This year I am getting married. Dot.
— PREMGI (@Premgiamaren) January 1, 2024
చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment