
మనోజ్‌కుమార్, బుచ్చిబాబు, బాబా పీఆర్
సూర్య భరత్ చంద్ర, విషిక కోట జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఐ యామ్ విత్ యూ’ (నీతోనే నేను) పాట లిరికల్ వీడియోను దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాట కమర్షియల్‌గా ఉంది. సూర్య, విషిక చాలా బాగా చేశారు. సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాక్సన్ విజయన్.
Comments
Please login to add a commentAdd a comment