
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే మరో సినిమాకు రామ్ చరణ్ సిద్ధమైపోయాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఆర్‌సీ16 చిత్రంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా)
అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ప్రముఖ ఫిట్‌నెస్ కోట్ శివోహంతో కలిసి సాధన మొదలెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు మెగా హీరో. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న చిత్రం కావడంతో అథ్లెట్ లుక్ కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఫిట్‌నెస్ ట్రైనర్ రామ్ చరణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, జాక్వెలిన్ లాంటి స్టార్స్‌కు సైతం కోచ్‌గా పనిచేశారు.
Beast mode on 🔥#RC16 loading… @Shivohamshivfit pic.twitter.com/6Oz3bXpySp
— Ram Charan (@AlwaysRamCharan) September 16, 2024