
రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమాలో రామ్‌చరణ్, ఆలియా భట్ ఓ జంటగా నటించి మెప్పించారు. ఈ ఇద్దరూ మళ్లీ జోడీ కట్టనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. మరి.. రామ్‌చరణ్, ఆలియా భట్ జోడీ రిపీట్ అవుతుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. రామ్‌చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమన్ స్వరకర్త. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లతో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment